ఎన్.ఎస్.ఎం. చారిటబుల్ సొసైటీ ప్రారంభం
విజయవాడ (మొగల్రాజపురం) :
అన్ని దానాల్లోకెల్లా విద్యాదానం చాలా గొప్పదని ఎన్.ఎస్.ఎం.స్కూల్ పూర్వ విద్యార్థి,æప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్ (పి.వి.పి.) అన్నారు. ఆదివారం ఉదయం బందరురోడ్డులో గేట్వే హోటల్లో పటమటలోని ఎన్.ఎస్.ఎం.స్కూల్ 1991 బ్యాచ్ విద్యార్ధుల ఆధ్వర్యంలో ఏర్పాౖటెన ఎన్.ఎస్.ఎం.ఛారిటబుల్ సొసైటీని పి.వి.పి. ప్రారంభించారు.
ఆయన మాట్లాడుతూ అప్పటి స్నేహితులనుSఇలా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. సొసైటీ అధ్యక్షుడు సూర్యప్రసాద్ నల్లూరు మాట్లాడుతూ సంపాందించిన సొమ్ములో నుంచి కొంత మొత్తాన్ని సమాజానికి తిరిగి ఇవ్వాలన్న ఆశయంతోనే ఈ సొసైటీని స్థాపించామన్నారు. సేవలను క్రమంగా నగరం వెలుపలకు విస్తరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎన్.ఎస్.ఎం.స్కూల్ ప్రిన్సిపాల్ డిసౌజా, సొసైటీ కార్యదర్శి శ్రీకాంత్ అట్లూరి, ఉపాధ్యాక్షురాలు ఆయేషా కాటూన్లతో పాటుగా స్కూల్ ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదిగిన విద్యార్థులు తమ ఉపాధ్యాయుల చేయూతను ఆప్యాయంగా గుర్తుచేసుకున్నారు.