ఆకట్టుకున్న ఎయిర్ క్రాఫ్ట్‌ల ప్రదర్శన
ఆనందపురం : మండలంలోని శొంఠ్యాంలో ఉన్న ఎన్‌ఎస్‌ఆర్టీ ఇంజినీరింగ్ కళాశాలలో మెకానికల్ విభాగం ఆధ్వర్యంలో రెండు రోజులగా జరుగుతున్న ఆర్సి ఎయిర్ క్రాఫ్ట్‌వర్క్ షాపు గురువారంతో ముగిసింది. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన ఎయిర్ క్రాఫ్ట్‌లు అందరినీ ఆకట్టుకున్నాయి. మెకానికల్ విభాగాధిపతి మురళీకష్ణ ఆధ్వర్యంలో మెకానిక్ అసోసియేషన్ ప్రతినిధి నితిన్కష్ణ, బంద సభ్యులు రూపొందించిన వివిధ రకాల ఎయిర్ క్రాఫ్ట్‌లను ప్రదర్శనలో ఉంచడంతో పాటు అవి వివిధ రంగాలలో ఎలా ఉపయోగపడతాయో, అవి పనిచేసే విధానాన్ని ప్రదర్శించి సోదాహరణంగా వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ బి.రవికుమార్, కరస్పాండెంట్ ఎన్.ప్రసాదరాజు, వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు, కో–ఆర్డినేటర్లు బి.రామాంజనేయులు, కోన రామప్రసాద్లు పాల్గొన్నారు.