ఆ లుక్ మనసు దోచేసింది..
ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ ఎంటర్టైనర్ 'నాన్నకు ప్రేమతో' ఫస్ట్ లుక్ ఫ్యాన్స్‌నే కాదు హీరోయిన్స్‌ని కూడా ఫిదా చేసింది. 'ఇది తారక్ మోస్ట్ స్టైలిష్ లుక్ కాదా..' అంటూ ఆ సినిమా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ట్వీట్ చేసింది. లండన్‌లో షెడ్యూల్ ముగించుకుని ఇన్ని రోజులకు హైదరాబాద్‌లో ల్యాండ్ అయ్యానని, తిరిగి హైదరాబాద్‌కి రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది ఈ అమ్మడు.
అలాగే అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు చెబుతూ.. ప్రతి ఒక్కరు ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలనే ఉపయోగించాలని.. అప్పుడు దేవుడు సంతోషిస్తాడని ట్వీటింది ప్రస్తుతానికి టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.