పదవుల కోసం పార్టీ పెట్టలేదు : పవన్
అనకాపల్లిరూరల్, న్యూస్‌లైన్ : పదవుల కోసం తాను పార్టీ పెట్టలేదని జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కల్యాణ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలోని ఎన్టీఆర్ గ్రౌండ్లో శనివారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. రాష్ట్ర విభజనకు పాల్పడిం ది సోనియాయేనని అన్నారు. మన్మోహన్ సోనియా చేతిలో కీలుబొమ్మ అని విమర్శించారు. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడుచుకుపోయిందని, డిపాజిట్లు కూడా రావని ఎద్దేవా చేశారు. అనకాపల్లి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పీలా గోవింద్, పట్టణ కోర్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.