nuclear capable
-
బైడెన్ వ్యాఖ్యలపై పాక్ ప్రధాని ఫైర్
ఇస్లామాబాద్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పాకిస్తాన్ అణ్వాయుధాల సామర్థ్యంపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చాలా ఘాటుగా స్పందించారు. గత దశాబ్దాలుగా అణ్వాయుధాల విషయంలో పాక్ అత్యంత బాధ్యతాయుతమైన అణు రాజ్యంగా నిరూపించుకుంది. తమ అణు కార్యక్రమాలను ఫూల్ ఫ్రుఫ్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్‌తో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు షెహబాజ్ ట్విట్టర్లో... అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. పాక్ బాధ్యతయుతమైన అణుదేశం. అంతర్జాతీయ అణుశక్తి(ఐఏఈఏ) అవసరాలకు అణుగుణంగా మా అణ్వాయుధాలకు అత్యుత్తమ రక్షణ వ్యవస్థ ఉంది. దీనికి మేము గర్విస్తున్నాం. అంతర్జాతీయ చట్టాలను గౌరవిస్తూ...జాతీయ ప్రయోజనాలను పరిరక్షించగల బాధ్యతాయుతమైన అణుదేశం పాక్. అన్ని స్వతంత్ర దేశాల మాదిరిగా మా అణుకార్యక్రమాల వల్ల ఏ దేశానికి ముప్పు వాటిల్లదు. మేము ప్రాంతీయ శాంతి భద్రతలను పెంపొందించడంలో యూఎస్‌కి సహకరించాలన్నదే మా కోరిక. దయచేసి అణు సామర్థ్యం విషయంలో లేనిపోని సందేహాలకు తావివ్వద్దు. అలాగే పాకిస్తాన్ తన స్వయంప్రతిపత్తి సార్వభౌమ రాజ్యాధికారం తోపాటు ప్రాదేశిక సమగ్రతను కాపాడుకునే హక్కును కలిగి ఉంది అని షెహబాజ్ ట్వీట్ చేశారు. ఈ క్రమంలో పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్ కూడా స్పందిస్తూ...బైడెన్ దేన్ని ఆధారం చేసుకుని ఈ వ్యాఖ్యలు చేశారంటూ నిలదీశారు. ముఖ్యంగా అణ్వాయుధీకరణ తర్వాత ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలలో పాల్గొన్న యూఎస్‌లా పాకిస్తాన్ ఎప్పుడు దూకుడుగా వ్యవహరించింది అని ప్రశ్నించారు. (చదవండి: పాకిస్తాన్‌పై బైడెన్ సంచలన వ్యాఖ్యలు... ఆ దేశాలతో ముప్పు) -
పాక్ అణు విస్తరణ కొనసాగింపు: యూఎస్ఏ
వాషింగ్టన్: అణుసామర్థ్య విస్తరణ, ఆధునీకరణను పాకిస్తాన్ 2022లో కూడా కొనసాగిస్తుందని అమెరికా ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారి స్కాట్ బెరియర్ అభిప్రాయపడ్డారు. భారత అణుసంపత్తిని, ఆధిక్యతను తట్టుకొని మనుగడ సాగించేందుకు పాక్ అణువిస్తరణ చర్యలను సమర్థించుకుంటుందన్నారు. భారత్‌తో ఉద్రిక్తతలు పాక్ రక్షణ విధానాలను నిర్దేశిస్తాయని కాంగ్రెస్ సభ్యులకు ఇచ్చిన నివేదికలో స్కాట్ చెప్పారు. 2019లో కశ్మీర్ ప్రత్యేక హోదాను భారత్ తొలగించడం ఉద్రిక్తతలు మరింత పెరిగేందుకు కారణమైందన్నారు. అయితే 2021 తర్వాత సరిహద్దు వద్ద హింసాత్మక ఘటనలు తగ్గినట్లు తెలిపారు. ఇరు దేశాలు దీర్ఘకాలిక దౌత్య పరిష్కారం వైపు దృష్టి సారించడంలేదన్నారు. చదవండి: మానవత్వం అంటే మనుషులకేనా?.. ఈ వీడియో ఏం చెబుతోంది! -
అగ్ని–5 పరీక్ష విజయవంతం
బాలాసోర్/చెన్నై: భారత్ మరో విజయం సాధించింది. అణ్వాయుధాలను మోసుకెళ్లే సామర్థ్యమున్న బాలిస్టిక్ క్షిపణి అగ్ని–5 పరీక్ష విజయవంతమైంది. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే ఈ క్షిపణి 5 వేల కిలోమీటర్ల దూరానికి పైగా ఉన్న లక్ష్యాన్ని చేధించగలదు. ఎన్నో అత్యాధునిక సాంకేతికతలున్న ఈ క్షిపణి ప్రయోగంవిజయవంతం కావడంతో క్షిపణి తయారీలో దేశీయ సాంకేతికతకు నూతనోత్సాహం వచ్చింది. అన్ని రాడార్లు, ట్రాకింగ్ వ్యవస్థలు క్షిపణి పనితీరును పరిశీలించినట్లు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. పరీక్ష పూర్తిగా విజయవంతమైందని, 19 నిమిషాల పాటు ప్రయాణించిన క్షిపణి 4,900 కిలోమీటర్లు దూసుకెళ్లిందని వెల్లడించాయి. ఒడిశా తీరంలోని అబ్దుల్ కలాం దీవి నుంచి కానిస్టర్ ద్వారా గురువారం ఈ క్షిపణిని పరీక్షించారు. అగ్ని శ్రేణిలో ‘అగ్ని–5’మరింత ఆధునికమైంది. కొత్త సాంకేతికతలతో అభివృద్ధిచేశారు. విస్తారమైన నావిగేషన్ వ్యవస్థ (ఆర్ఐఎన్ఎస్), అత్యాధునికమైన మైక్రో నావిగేషన్ వ్యవస్థ (ఎంఐఎన్‌ఎస్)లు ఉండటం వల్ల ఈ క్షిపణి చాలా కచ్చితత్వంతో లక్ష్యాన్ని చేధించగలదు. తమిళనాడు పాత్ర కీలకం..: అగ్ని–5 క్షిపణి పరీక్ష విజయవంతం కావడంలో తమిళనాడు పాత్ర మరువలేనిదని రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. బాలిస్టిక్ క్షిపణిలో అవసరమయ్యే ముఖ్యమైన పరికరాలు తమిళనాడు పరిశ్రమల నుంచే వచ్చాయని చెప్పారు. గురువారం చెన్నైలో జరిగిన రక్షణ పరిశ్రమల అభివృద్ధి సదస్సులో ఆమె పాల్గొన్నారు. అగ్ని శ్రేణిలో క్షిపణులు.. ♦ క్షిపణి లక్ష్యాన్ని చేధించగలిగే సామర్థ్యం, ♦ అగ్ని–1,700 కి.మీ., ♦ అగ్ని–2, 2000 కి.మీ., ♦ అగ్ని–3, 42,500 నుంచి 3,500 కి.మీ., ♦ అగ్ని–5 5,000 కి.మీ. -
డీఆర్డీవో శాస్త్రవేత్తలకు వైఎస్ జగన్ అభినందన
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం డీఆర్డీవో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. అగ్ని-4 ఉపరితల క్షిపణి ప్రయోగం విజయవంతంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. ఒడిశాలోని బాలాసోర్‌లోని అబ్దుల్ కలాం వీలర్ ఐలాండ్ నుంచి డీఆర్డీవో శాస్త్రవేత్తలు అగ్ని-4 క్షిపణి ప్రయోగాన్ని ప్రయోగించారు. నాలుగు వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఈ క్షిపణి సునాయసంగా ఛేదించగలిగింది. ఈ క్షిపణికి వెయ్యి కిలోల పేలోడ్‌ను మోసుకెళ్లగల సామర్థ్యం కలిగి ఉంది.