కూడంకుళం అణు విద్యుత్ ఉత్పత్తి వాయిదా
కూడంకుళం అణు విద్యుత్ ప్రాజెక్ట్ నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియ మరోసారి వాయిదా పడింది. మొదటి విడత వెయ్యి మెగావాట్ల యూనిట్ ప్రారంభించాలని భారత అణు విద్యుత్ కార్పొరేషన్ (ఎన్పీసీఐఎల్) అంచనా వేస్తోంది. వచ్చే నెలలో సాకారం కావచ్చని భావిస్తోంది. గత జూన్‌లోనే యూనిట్‌ను ఆరంభించినా రెండు కండెన్సర్లలో సమస్యలు తలెత్తడంతో ఆగిపోయింది.
యూనిట్ నిర్మాణం పనులు గత సెప్టెంబర్ నాటికి 99.76 శాతం పూర్తయ్యాయని ఎన్పీసీఐఎల్ అధికారులు తెలిపారు. నవంబర్‌కు ప్రక్రియ మొదలవుతుందని అంచనా వేసింది. తిరునెల్వేలి జిల్లాలోని కూడంకుళం వద్ద వెయ్యి మెగావాట్ల రష్యా రియాక్టర్లు రెండింటిని ఏర్పాటు చేసింది. ఈ ప్రాజెక్ట్ మొత్తం వ్యయం 17000 కోట్ల రూపాయలు.