రైలు కిందపడి ఉద్యోగి మృతి
కారేపల్లి: రైలు దిగబోతూ ప్రమాదవశాత్తూ ఓ వ్యక్తి చక్రాల కింద పడి మృతి చెందాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలం ఏర్యాతండాకు చెందిన నూనావత్ రాములు (45) రైల్వేలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. శనివారం ఉదయం మణుగూరు ప్యాసింజర్ రైలు ఎక్కిన అతడు కారేపల్లి స్టేషన్లో రైలు దిగబోతూ కాలు జారి పట్టాలపై పడిపోయాడు. రైలు అతడి పై నుంచి వెళ్లిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.