ఆధునిక పద్ధతులతో నర్సరీల అభివృద్ధి
కడియం :
ఎప్పటికప్పుడు సాగు విధానాల్లో చోటు చేసుకుంటున్న ఆధునిక పద్ధతులను అనుసరించడం ద్వారా నర్సరీలను మరింత అభివృద్ధి చేసుకోవచ్చునని ఇండియ¯ŒS నర్సరీమె¯ŒS అసోసియేష¯ŒS (ఐఎ¯ŒSఏ) అధ్యక్షుడు పల్ల సుబ్రహ్మణ్యం తెలిపారు. పశ్చిమబెంగాల్ నర్సరీ అసోసియేష¯ŒS ఆధ్వర్యంలో హౌరాలోని పాల్ గార్డె¯ŒSలో నేషనల్ ఇ¯ŒSస్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్స్ హెల్త్ మేనేజ్మెంట్ (ఎ¯ŒSపీహెచ్యం) సహకారంతో రైతులకు రెండు రోజుల పాటు నిర్వహించిన శిక్షణ తరగతులు మంగళవారంతో ముగిశాయి. పశ్చిమబెంగాల్ రాష్ట్రం నుంచి వచ్చిన 300 మందికిపైగా రైతులకు మొక్కల సంరక్షణ, యాజమాన్య పద్ధతులపై శిక్షణ ఇచ్చారు. ముగింపు కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మొక్కల సాగుకు పూర్తి స్థాయిలో శాస్త్రవేత్తల సహకారం అందే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. ఐఎ¯ŒSఏ, ఎ¯ŒSఐపీహెచ్ఎంల సంయుక్త ఆధ్వర్యంలో ఇతర రాష్ట్రాల్లో కూడా ఇటువంటి సదస్సులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఎ¯ŒSఐపీహెచ్ఎం శాస్త్రవేత్తలు డాక్టర్ సుశీల, డాక్టర్ గిరీష్, డాక్టర్ నర్సారెడ్డి, పశ్చిమబెంగాల్ నర్సరీ మె¯ŒS అసోసియేష¯ŒS అధ్యక్షుడు కమల్ చక్రవర్తి, ఐఎ¯ŒSఏ ఉపాధ్యక్షుడు ప్రాణ్కుమార్దత్తా, కార్యదర్శి చిన్మయి సాహు, ఈసీ మెంబర్ తప¯ŒSజానా తదితరులు పాల్గొన్నారు.