nuruddin
-
బీసీల సభలో టీడీపీ నేతలే ఎక్కువ..
రామవరప్పాడు/గన్నవరం : లోకేశ్ యువగళం పాదయాత్ర కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గంలో ప్రజలు, ప్రయాణికుల సహనానికి పరీక్ష పెట్టింది. విజయవాడ రూరల్ మండలం నిడమానూరుకు చేరుకున్న పాదయాత్ర విజయవాడ మీదుగా సోమవారం గన్నవరం నియోజకవర్గానికి చేరుకోగా.. సాయంత్రం నిడమానూరు క్యాంప్ సైట్లో బీసీ సామజికవర్గాల ప్రతినిధులతో లోకేశ్ ముఖాముఖి నిర్వహించారు. సమావేశంలో బీసీ ప్రతినిధుల కంటే టీడీపీ నేతలే ఎక్కువగా ఉన్నారు. సమావేశంలో.. ‘ చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ముస్లిం మైనార్టీలకు ఏం చేశాడ’ని లోకేశ్‌ను ప్రశ్నించేందుకు ప్రయత్నించిన ముస్లిం రైట్స్ అండ్ వెల్ఫేర్ వ్యవస్థాపక అధ్యక్షుడు సయ్యద్ నూరుద్దీన్‌ను పోలీసులు అడ్డుకున్నారు. లోకేశ్ మాట్లాడుతుండగానే జనం మెల్లగా జారుకున్నారు. గన్నవరం చేరుకున్న పాదయాత్ర అనంతరం.. లోకేశ్ పాదయాత్ర సోమవారం రాత్రి కృష్ణాజిల్లా గన్నవరం చేరుకుంది. అంతకుముందు, కేసరపల్లి వద్ద మండలంలోకి ప్రవేశించిన యాత్ర ఎయిర్పోర్ట్, దుర్గాపురం, గన్నవరం మీదుగా చిన్నఆవుటపల్లిలోని ఎన్ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఆవరణలో క్యాంప్ సైట్‌కు చేరుకుంది. పాదయాత్ర జాతీయ రహదారిపై కొనసాగడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నప్పటికీ టీడీపీ శ్రేణుల అత్యుత్సాహం ఫలితంగా ప్రయాణికులు అసహనానికి గురయ్యారు. కొంతమంది మద్యం మత్తులో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలిగించారు. ఇక లోకేశ్ సమక్షంలో కేడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్ యార్లగడ్డ వెంకట్రావు టీడీపీలో చేరారు. మరోవైపు.. మండల పార్టీ ఇచ్చిన రూటుకు భిన్నంగా ఎమ్మెల్యే కార్యాలయం మీదుగా పాదయాత్ర వెళ్లాని టీడీపీ నేతలు పట్టుబట్టారు. అయితే, పోలీసులు అంగీకరించలేదు. దీంతో రూట్‌మ్యాప్ ప్రకారం పాదయాత్ర కొనసాగింది. -
దొంగతనం కేసులో ఇద్దరి అరెస్ట్
దొంగతనం కేసులో ఇద్దరు నిందితులను చాంద్రాయణగుట్ట పోలీసులు అరెస్ట్ చేసి గురువారం రిమాండ్‌కు తరలించారు. నిందితుల వద్ద నుంచి 27 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. దక్షిణ మండలం అదనపు డీసీపీ కె.బాబురావు విలేకర్ల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. చాంద్రాయణగుట్ట తాళ్లకుంట ప్రాంతానికి చెందిన మహ్మద్ శంషూద్దీన్, మహ్మద్ నూరుద్దీన్(20) తండ్రి కొడుకులు. కాగా నూరుద్దీన్ పుట్టినప్పుడే తల్లి చనిపోవడంతో శంషూద్దీన్ కుమారుడిని తన తమ్ముడు మహ్మద్ బషీరుద్దీన్‌కు ఇచ్చి వేరే వివాహం చేసుకున్నాడు. ఇలా చిన్న తనం నుంచి చిన్నాన్న బషీరుద్దీన్ వద్దే పెరిగిన నూరుద్దీన్ పూలు విక్రయించేవాడు. కాగా చెడు అలవాట్లకు బానిసైన నూరుద్దీన్ సులభంగా డబ్బులు సంపాదించేందుకు దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగానే 2015 మే మాసంలో తన పెరిగిన చిన్నాన్న ఇంట్లోనే ఎవరూ లేని సమయం చూసి 17 తులాల బంగారు ఆభరణాలు తస్కరించాడు. ఈ బంగారు ఆభరణాలను శాలిబండలోని ఎం.ఎం. జ్యూయలరీ దుకాణం ఉన్న తన స్నేహితుడు సయ్యద్ ముజఫర్(29)కు ’ 75 వేలకు విక్రయించాడు. ఎలాంటి బిల్లులు లేకుండా ఉన్న ఈ బంగారు ఆభరణాలను అదును చూసిన ముజఫర్ తక్కువ ధరకే కొనుగోలు చేశాడు. ఈ విషయమై అప్పట్లోనే నూరుద్దీన్ చిన్న తల్లి చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్‌లో నూరుద్దీన్‌పై ఫిర్యాదు చేసింది. కాగా అప్పుడు నిందితుడు నేరం ఒప్పుకోలేదు. తమ ఇంట్లో ఉండి దొంగతనం చేసినందుకు బషీరుద్దీన్ వెంటనే నూరుద్దీన్‌ను ఇంటి నుంచి గెంటి వేశాడు. మళ్లీ ఈ నెలలో బషీరుద్దీన్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో నూరుద్దీన్ పది తులాల బంగారు ఆభరణాలు చోరీ చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న చాంద్రాయణగుట్ట డీఐ పి.శంకర్, ఎసై ్స రాజశేఖర్‌లు నూరుద్దీన్‌ను అదుపులోకి తీసుకొని విచారించడంతో అసలు విషయం వెల్లడించాడు. నూరుద్దీన్‌తో పాటు అతని స్నేహితుడు ముజఫర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు వారి వద్ద నుంచి ’ 9 లక్షల విలువ జేసే 27 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఈ విలేకర్ల సమావేశంలో ఫలక్‌నుమా ఏసీపీ మహ్మద్ అబ్దుల్ బారీ, చాంద్రాయణగుట్ట ఇన్స్పెక్టర్ వై.ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.