'రుణమాఫీ పేరుతో మోసపోయాం'
నూజెండ్ల: వ్యవసాయ రుణమాఫీ పేరుతో మోసపోయామని గుంటూరు జిల్లా నూజెండ్ల రైతులు వాపోయారు. ఎన్నికల్లో హామీయిచ్చిన విధంగా వ్యవసాయ రుణలు మాఫీ చేయాలని ఎంపీ రాయపాటి సాంబశివరావు, ఎమ్మెల్యే ఆంజనేయులను మంగళవారమిక్కడ నిలదీశారు.
బ్యాంకు అధికారులతో మాట్లాడతామని ఎంపీ, ఎమ్మెల్యే ఎస్ బీఐ లోనికి వెళ్లారు. న్యాయం జరిగే వరకు కదిలేది లేదంటూ అన్నదాతలు బ్యాంకు ఎదుట బైఠాయించారు. రుణమాఫీ చేసే వరకు పోరాడతామని రైతులు స్పష్టం చేశారు.