నల్లధనాన్ని వెలికితీస్తే నిరసనలెందుకు: ప్రభాకర్
సాక్షి, హైదరాబాద్: నల్లధనాన్ని వెలికి తీస్తుంటే ప్రతిపక్షపార్టీలు నిరసనలు ఎందుకు చేస్తున్నాయో చెప్పాలని బీజేపీ ఎమ్మెల్యే ఎన్.వి.ఎస్.ప్రభాకర్ అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఆయన విలేక రులతో మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు ఆందోళన చెందడం లేదన్నారు. నల్లధ నాన్ని వెలికితీయడానికి, తీవ్రవాదాన్ని అరికట్టడానికి పెద్దనోట్లను రద్దు చేయాలని ప్రధాని మోదీ నిర్ణయం తీసుకున్నారన్నా రు. లెఫ్ట్ పార్టీలు నల్లకుబేరులకు వత్తాసు పలుకుతున్నాయని విమర్శించారు.