ఓ నైలాన్ తాడు చిన్నారి పాలిట ఉరితాడైంది!
మధురై: ఓ నైలాన్ తాడు చిన్నారి పాలిట మృత్యువుగా మారింది. తాను ఆడుతున్న నైలాన్ తాడు మెడకు చుట్టుకుపోవడంతో 11 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన తమిళనాడులోని మధురైలోని క్రైమ్ బ్రాంచ్ పోలీస్ హెడ్ క్వార్టర్ లో చోటు చేసుకుంది.
ట్రాఫిక్ కానిస్టేబుల్ కుమారుడు దక్షిణాబాలన్ తన తమ్ముడితో కలిసి తాడుతో ఆట ఆడుతుండగా... అనుకోకుండా మెడకు చుట్టుకుపోయింది. అయితే మెడకు చుట్టుకున్న తాడును తొలగించడం తమ్ముడికి వీలుకాలేదు. ఈ గందరగోళంలో మెడకు తాడు మరింత బిగుసుకుపోవడంతో ప్రాణాలు విడిచినట్టు పోలీసులు తెలిపారు.