Occult rituals
-
నెల్లూరు జిల్లాలో అర్ధరాత్రి క్షుద్రపూజలు
సాక్షి, ఆత్మకూరు : నెల్లూరు జిల్లాలో క్షుద్రపూజల నిర్వహణ కలకలం సృష్టిస్తోంది. జిల్లాలోని ఆత్మకూరు పట్టణలోని 16 వ వార్డులో గల ఓ ఇంట్లో మంగళవారం అర్ధరాత్రి క్షుద్రపూజలు నిర్వహించారు. కేరళ రాష్ట్రానికి చెందిన వ్యక్తులను తీసుకొచ్చి పూజలు నిర్వహించారు. కాగా... భయాందోళనకు గురైన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఆ ఇంటికి వచ్చిన పూజలు నిర్వహించిన వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. -
యువతి శవంపై కూర్చొని క్షుద్రపూజలు
కేకే.నగర్ : పెరంబలూరు ఎంఎం.నగర్లో నివసిస్తున్న మంత్రవాది కార్తికేయన్(32) ఆత్మలతో మాట్లాడేందుకు క్షుద్ర పూజలు చేస్తుండగా పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇతడు మరొక క్షుద్ర మాంత్రికుడు సతీష్ సహాయంతో ఆత్మహత్య చేసుకున్న తేనాంపేట ఎంఎం.గార్డెన్‌కు చెందిన యువతి అభిరామి మృతదేహాన్ని స్మశానం నుంచి వెలికితీసి కారులో పెరంబలూరుకు పంపినట్లు తెలుస్తోంది. ఈ మృతదేహంపై కూర్చొని కార్తికేయన్ 45 రోజులకు పైగా అర్ధరాత్రి పూజలు జరిపారు. ఈ క్రమంలో అభిరామి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పెరంబలూరు పోలీసులు కార్తికేయన్, అతని భార్య నజీమా సహా ఆరుగురిని అరెస్టు చేసి జైలుకు పంపారు. సోమవారం అభిరామి మృతదేహానికి పెరంబలూరు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో పునః పోస్టుమార్టం జరిపారు. అనంతరం అభిరామి తల్లి కామాక్షి, అన్న తిరువరంగన్లు మృతదేహాన్ని తీసుకుని ఆత్తూరు రోడ్డుపై గల స్మశానంలో అంత్యక్రియలు జరిపి అస్థికలను తీసుకుని చెన్నై బయలుదేరారు. తమ కుమార్తెకు కలిగిన దుస్థితిని తలచుకుని అభిరామి తల్లి బోరున విలపించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆమె అన్న కన్నీటితో ప్రార్థించిన దృశ్యం అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. -
క్షుద్రపూజల పేరుతో.. మైనర్‌పై అఘాయిత్యం
నార్కెట్‌పల్లి: నల్లగొండ జిల్లాలో ఘోర సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. క్షుద్రపూజలు చేస్తే భారీగా డబ్బు వస్తుందని నమ్మించి ఓ విద్యార్థినిపై అత్యాచారం జరిపిన ఘటన నార్కెట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. నార్కెట్‌పల్లి మండలం బాజకుంట గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థిని(16)ని జాతకం బాగుందని.. ఆమెతో క్షుద్ర పూజలు చేయిస్తే భారీ మొత్తంలో నగదు లభిస్తుందని నమ్మించి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. అదే గ్రామానికి చెందిన ఓ మహిళ సాయంతో బాలికను తీసుకెళ్లిన వ్యక్తి ఆమెను ముందు తిరుమలగిరి తీసుకెళ్లి.. అనంతరం అక్కడి నుంచి నార్కెట్‌పల్లి మండలంలోని నెమ్మాని గ్రామానికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెను బంధించి నాలుగు రోజుల పాటు అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు తండ్రి సాయంతో శనివారం నార్కెట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా.. ఈ సంఘటనతో నెమ్మాని ఎంపీటీసీ భర్త వెంకన్నతో పాటు మరో ముగ్గురికి సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
గుప్తనిధుల కోసం తవ్వకాలు
నంది విగ్రహం అపహరణకు యత్నం? కరీంనగర్ రూరల్: కరీంనగర్ మండలం నగునూరులోని పోచమ్మ ఆలయ ఆవరణలోని నంది విగ్రహాన్ని అపహరించేందుకు బుధవారం రాత్రి కొందరు వ్యక్తులు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. స్థానికుల కథనం ప్రకారం.. పాపన్నగానిపల్లె శివారులోని పోచమ్మ ఆలయం ఎదుట ఉన్న పురాతనమైన నంది విగ్రహం కింద గుప్త నిధులున్నాయన్న అనుమానంతో గుర్తు తెలియని వ్యక్తులు తవ్వకాలు సాగించారు. బుధవారం రాత్రి ట్రాలీలో వచ్చిన ముఠా సభ్యులు క్షుద్రపూజలు చేసి విగ్రహాన్ని కొంతదూరం తరలించారు. విగ్రహం జరిపిన చోట పసుపు, కుంకుమ చల్లి క్షుద్రపూజలు చేసి తవ్వకాలు జరిపేందుకు ప్రయత్నించగా.. సాధ్యంకాక వెళ్లిపోయారు. ఉదయం పొలాలకు వెళ్తున్న కొందరు రైతులు నంది విగ్రహం వేరేచోట ఉండడాన్ని గమనించి స్థానిక ప్రజాప్రతినిధులకు సమాచారం అందించారు. అయితే విగ్రహాన్నే తరలించే ప్రయత్నం చేశారని కొందరు భావిస్తున్నారు. -
క్షుద్ర పూజలు చేస్తున్న ఐదుగురి అరెస్ట్
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం గువ్వలగూడెంలో క్షుద్రపూజలు చేస్తున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు సోమవారం ఉదయం అరెస్ట్‌చేశారు. గ్రామస్తుల ఫిర్యాదుమేరకు దాడిచేసిన పోలీసులు గ్రామ శివారులో క్షుద్రపూజలు చేస్తున్న వారిని పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారు. వారి నుంచి వివరాలు సేకరిస్తున్నారు. -
క్షుద్రపూజలు చేశాడని చావగొట్టారు...
వరంగల్ జిల్లా మహబూబాబాద్ శివారు యాదవ్‌నగర్ కాలనీలో క్షుద్రపూజలు చేస్తున్న ఓ వృద్ధుడ్ని స్థానికులు పట్టుకుని చితక్కొట్టారు. నెల్లికుదురు మండలం వావిలాల శివారు తండాకు చెందిన లచ్చిరామ్‌నాయక్ (65) మరికొందరితో కలసి యాదవ్‌నగర్ కాలనీలో ఆదివారం అర్ధరాత్రి సమయంలో క్షుద్రపూజలు చేస్తుండగా స్థానిక యువకులు పట్టుకున్నారు. లచ్చిరామ్ నాయక్ దొరకగా, మిగిలిన వారు పరారయ్యారు. అతడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. -
క్షుద్రపూజలు: కన్నబిడ్డను చంపిన తండ్రి
ఒంగోలు: ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. క్షద్రపూజల కోసం కన్నబిడ్డనే బలి ఇచ్చాడో తండ్రి. స్థానిక మదర్‌థెరిస్సా కాలనీకి చెందిన సద్ది రాజిరెడ్డి అలియాస్ దెయ్యాల రాజిరెడ్డి జాతకాలు చెబుతుంటాడు. రాజిరెడ్డి ఓ మహిళతో కొన్ని రోజులుగా సహజీవనం చేస్తున్నాడు. వారికి మూడు నెలల బాబు ఉన్నాడు. చిన్నారిని హత్య చేసి ఇంట్లోనే పూడ్చిపెట్టి క్షుద్రపూజలు చేస్తున్నారని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సోమవారం ఉదయం అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి రాజిరెడ్డి దంపతులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.