offender arrest
-
హత్య కేసులో నిందితుడి అరెస్ట్
తాడేపల్లిగూడెం రూరల్ : యువకుడి హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్టు కొవ్వూరు డీఎస్పీ నర్రా వెంకటేశ్వరరావు తెలి పారు. శనివారం స్థానిక పట్టణ సర్కిల్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని కడకట్ల కొత్త బ్రిడ్జి వద్ద నివాసముం టున్న ముప్పిన చిరంజీవి అలియాస్ లడ్డూ (26) అనే వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసి మృతదేహాన్ని బ్రిడ్జి దిగువన పడేశారన్నారు. ఈ మేరకు మృతుని తండ్రి రమణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ సీఐ మూర్తి కేసు నమోదు చేసినట్టు చెప్పారు. దీనికి సంబంధించి నిపుణులు సేకరించిన ఆధారాలతో దొమ్మర్ల కాలనీకి చెందిన పాత నేరస్తుడు కొమ్మిరెడ్డి నాగు అలియాస్ గణేష్ హత్యకు పాల్ప డినట్టు విచారణలో తేలిందన్నారు. పలు పోలీస్స్టేషన్లలో ఇతనిపై కేసులు ఉన్నాయని చెప్పారు. సమాచారం మేరకు నిందితుడు గణేష్ అతని ఇంటి వద్ద ఉండగా సీఐ మూర్తి అరెస్టు చేశారని పేర్కొన్నారు. దర్యాప్తులో సీఐకు సహకరించిన పట్టణ ఎస్ఐలు ఎం.సూర్యభగవాన్, ఐ.వీర్రాజు, పో లీస్ సిబ్బందిని ఎస్పీ భాస్కర్‌భూషణ్, డీఎస్పీ నర్రా వెంకటేశ్వరరావు అభినందించారు. -
మృగాడి వికృత చేష్ట.. వినుప్రియ విషాదాంతం!
- ఫేస్బుక్లో వినుప్రియ ఫొటోమార్ఫింగ్ చేసి పోస్ట్ చేసిన యువకుడు - ఫిర్యాదు చేసినా పట్టించుకోని ఖాకీలు, సైబర్ క్రైమ్ - నగుబాటు భరించలేక తనువు చాలించిన యువతి - ప్రేమికుడి అరెస్ట్.. హెడ్ కానిస్టేబుల్ సస్పెన్షన్ సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రేమ మాటున మృగాడి వికృత చేష్ట.. ఖాకీల అలవిమాలిన నిర్లక్ష్యం.. వెరసి యువతి ప్రాణాలు తీశాయి. ఫొటోమార్ఫింగ్పై పోలీసులు చర్యలు తీసుకోకపోవడంతో భరించలేని అవమాన భారంతో బాధితురాలు ఉరి వేసుకొని తనువు చాలించింది. తమిళనాడులోని సేలం జిల్లాకు చెందిన చేనేత కార్మికుడు అన్నాదురై కుమార్తె వినుప్రియ (20) బీఎస్సీ పాసై ఓ పాఠశాలలో టీచర్‌గా చేరింది. హాయిగా సాగుతున్న ఆమె జీవితంలో మార్ఫింగ్ చేసిన అశ్లీల ఫొటోలు ఈనెల 17న ఫేస్బుక్లో ప్రత్యక్షమయ్యాయి. ఇది చూసి అవమానభారంతో కుంగిపోయిన వినుప్రియ తల్లిదండ్రులకు చెప్పుకొని బోరున విలపించింది. తండ్రి అన్నాదురై ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఐడీని బ్లాక్ చేసే సర్వర్ విదేశాల్లో ఉంటుందని, ఇందుకు 20 రోజులు పడుతుందని అక్కడ తాపీగా సమాధానం ఇచ్చారు. అన్నాదురై అక్కడి నుంచి సైబర్‌క్రైం పోలీసుల వద్దకు వెళ్లి వేడుకున్నాడు. అక్కడ ఒక సెల్‌ఫోన్ కొనివ్వమని హెడ్ కానిస్టేబుల్ సురేశ్ బేరమాడాడు. అన్నాదురై వెంటనే సెల్‌ఫోన్ కొనిచ్చాడు. అయినా నిందితుడిని పట్టుకునే ప్రయత్నం సురేశ్ చేయలేదు. ఈ క్రమంలో 26న మరోసారి వినుప్రియ అశ్లీల ఫొటో ఫేస్బుక్లో కనిపించింది. హతాశులైన తల్లిదండ్రులు మళ్లీ పోలీసుల వద్దకు పరుగులు తీశారు. తనకు, తనవారికి జరిగిన అవమానాన్ని భరించలే కపోయిన వినుప్రియ ఈనెల 26న సాయంత్రం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఫేస్బుక్ ఐడీని బ్లాక్ చేయడానికి 20 రోజుల సమయం పడుతుందని నిర్లక్ష్యం వహించిన పోలీసులు ఆమె ఆత్మహత్య చేసుకున్న కొన్ని గంటల్లోనే బ్లాక్ చేశారు. మూడో రోజునే నిందితుడి అరెస్ట్ జరిగిపోయింది. ఫిర్యాదు అందగానే పోలీసులు చర్య తీసుకుని ఉంటే మరోసారి అశ్లీల ఫొటోలు ప్రచారమయ్యేవి కావని, వినుప్రియ నిండు ప్రాణాలు పోయేవి కావని సర్వత్రా చర్చ జరుగుతోంది. ప్రేమించలేదని.. ప్రేమ పేరుతో ఉన్మాదిగా మారిన సురేశ్ అనే యువకుడే వినుప్రియ ప్రాణాలను బలిగొన్నట్లు తెలుస్తోంది. సేలం జిల్లా కల్‌పారాపట్టికి చెందినసురేశ్.. వినుప్రియ వెంట పడేవాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తామంటూ వినుప్రియ తల్లిదండ్రులు హెచ్చరించడంతో ఆమె పరువు తీయాలని నిర్ణయించుకున్నాడు. వినుప్రియ ఫొటోను సంపాదించి మార్ఫింగ్ చేసి ఫేస్బుక్లో పెట్టినట్లు బుధవారం అరెస్టయిన సురేశ్ పోలీసుల వద్ద అంగీకరించాడు. సెల్‌ఫోన్ లంచంగా తీసుకున్న హెడ్ కానిస్టేబుల్ సురేశ్‌ను సస్పెండ్ చేశారు. వినుప్రియ ఫొటోలను మార్ఫింగ్ చేసిన నిందితుడిపై పోలీసులు కేసు పెట్టారు. -
వినుప్రియ ఆత్మహత్య కేసులో ...
టీనగర్: వినుప్రియ ఆత్మహత్య కేసులో నిందితుడిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. సేలం సమీపానగల ఇలంపిళ్లై ప్రాంతానికి చెందిన చేనేత కార్మికుడు అన్నాదురై కుమార్తె వినుప్రియ (20) ఆదివారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఫేస్బుక్లో అసభ్య చిత్రాన్ని విడుదల చేసిన నిందితులను అరెస్టు చేసేంతవరకు తమ కుమార్తె మృతదేహాన్ని తీసుకెళ్లమని తెలుపుతూ వినుప్రియ తల్లిదండ్రులు ఆందోళనలో పాల్గొన్నారు. దీనిపై జిల్లా ఎస్పీ అమిత్‌కుమార్ సింగ్ సమాధాన చర్చలు జరపడంతో వినుప్రియ మృతదేహాన్ని వారు తీసుకువెళ్లారు. ఇలావుండగా ఈ కేసు గురించి మకుడంచావడి పోలీసులు విచారణ జరుపుతూ వచ్చారు. ఇందులో ఇలంపిళ్లై సమీపానగల కల్పారపట్టి ప్రాంతానికి చెందిన పి. సురేష్ (21) అనే చేనేత కార్మికుని పోలీసులు అరెస్టు చేశారు. నష్ట పరిహారం చెల్లించాలి: ఐద్వా ఆత్మహత్య చేసుకున్న వినుప్రియ కుటుంబానికి ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాలంటూ అనైత్తిండియా జననాయగ మాదర్ సంఘం (ఐద్వా) డిమాండ్ చేసింది. ఈ కేసులో వినుప్రియ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తూ సేలం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట మంగళవారం ఆందోళన జరిపారు. ఈ ధర్నాలో సీపీఎం జిల్లా కార్యదర్శి తంగవేలు, ఐద్వా జిల్లా కార్యదర్శి కె. రాజాత్తి, ఇందియ జననాయగ వాలిబర్ సంఘం జిల్లా కార్యదర్శి ఎన్ ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. దీనిగురించి ఐద్వా రాష్ట్ర కార్యదర్శి జ్యోతిలక్ష్మి మాట్లాడుతూ ఈ కేసును సత్వరమే ముగించాలని కోరారు. వినుప్రియ మరణానికి పోలీసులు నైతిక బాధ్యత వ హించాలని, ఆమె కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తగిన నష్ట పరిహారం అందచేయాలని డిమాండ్ చేశారు. -
హత్య కేసులో నిందితుడి అరెస్ట్
లక్కవరపుకోట: హత్య కేసులో నిందితుడ్ని స్థానిక పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఈ మేరకు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సీఐ సంజీవరావు, ఎస్సై నరేష్ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. మండలంలోని రెల్లిగౌరమ్మపేటకు చెందిన దార వెంకటరమణ (32) తన భార్య అప్పలకొండను గురువారం రాత్రి హత్య చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి వెళ్లి వివరాలు సేకరించగా, అదే రోజు రాత్రి నిందితుడు వెంకటరమణ వీఆర్ఓ డీవీ రామదాసు సమక్షంలో పోలీసులకు లొంగిపోయూడు. దీంతో పోలీసు లు అతడ్ని విచారించగా నేరాన్ని అంగీకరించాడు తన భార్య వేరొక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్లే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. దీంతో అతడ్ని అరెస్ట్ చేసి కొత్తవలసలో కోర్టులో హాజరుపరిచారు. హత్యకు సంబంధించిన కత్తిని పోలీ సులు స్వాధీనం చేసుకున్నారు. కార్యక్రమంలో ఏఎస్సై ఎల్.మన్మధరావు, కానిస్టేబుల్స్ పి.ప్రశాంత్‌కుమార్, షేక్ అమీనభీబి, సురేష్ పాల్గొన్నారు.