కేక పుట్టిస్తున్న షియామి ఆఫర్లు
ఒక్క రూపాయకే షియోమి ఫోన్లు.. పవర్ బ్యాక్ లట! ఎప్పుడనుకుంటున్నారా..? ఈ నెల 20-22 మధ్యలో మూడు రోజుల ఉత్సవంగా చైనీస్ దిగ్గజం వినియోగదారులను మురిపించనుంది. భారత్ లోకి ప్రవేశించి రెండేళ్లయిన సందర్భంగా మూడు రోజుల ఉత్సవాన్ని షియోమి ఘనంగా నిర్వహించబోతోంది. ఈ ఉత్సవంలో భాగంగా షియోమి ఈ బంపర్ ఆఫర్లను వినియోగదారుల ముగింట ఉంచనుంది. కంటెస్ట్ లను నిర్వహించడంతో పాటు.. కొన్ని ఉత్పత్తులపై తాత్కాలిక ధరల తగ్గింపు, రూ.1కే ప్లాష్ డీల్ వంటివి "మి" రెండో వార్షికోత్సవంలో ఆఫర్లుగా వినియోగదారులను మురిపించనున్నాయి.
రిజిస్టర్ యూజర్లకు రూ.1కే దాని డివైజ్ లు అందించడంతో ఈ ఫ్లాష్ డీల్ ప్రారంభమవుతుంది. మొదటి రోజు, 10 షియోమి మి5 ఫోన్లు, 100 మి పవర్ బ్యాంకు(2000ఎంఏహెచ్)లను అందుబాటులో ఉంచనుంది. రెండో రోజు(జూలై 21న) 10 షియోమి రెడ్ మి నోట్ 3, 100 మి బ్రాండ్(వైట్ ఎల్ఈడీ) లు ప్లాష్ అమ్మకాల్లో మురిపించనున్నాయి. చివరిరోజు(జూలై 22న) 10 షియోమి మి మ్యాక్స్, 100 మి బ్లూటూత్ స్పీకర్లు అందుబాటులో ఉండనున్నాయి. ప్రతిరోజు మధ్యాహ్నం 2గంటలకు ఈ ఫ్లాష్ డీల్ ను షియోమి నిర్వహించనుంది. రిజిస్ట్రేషన్లు సమాచారం జూలై 19వ తేదీన ఫేస్ బుక్ లో తెలియజేస్తామని షియోమి ప్రకటించింది.
ఈ ఫ్లాష్ ఆఫర్ తో పాటు..తన కొత్త ఉత్పత్తులు 10000ఎంఏహెచ్ మి పవర్ బ్యాంకు, మి ఇన్-ఇయర్ క్యాప్సుల్ హెడ్ ఫోన్లు, మి ఇన్-ఇయర్ హెడ్ ఫోన్లు ప్రో గోల్డ్ వేరియంట్లను లిమిటెడ్ స్టాక్స్ లో మూడు రోజులు అందుబాటులో ఉంచనుంది. మి క్యాష్ కూపన్లు, గేమ్ ఆడటం కోసం ఉచిత మి మ్యాక్స్ లను మి 2వ వార్షికోత్సవ వెబ్ సైట్ ద్వారా వినియోగదారులకు ఇవ్వనుంది. ధరల తగ్గింపులో భాగంగా బ్లూటూత్ స్పీకర్ పై రూ.700 డిస్కౌంట్ ను ప్రవేశపెట్టి, ఆ మూడు రోజులు రూ.1,999లకే బ్లూటూత్ స్పీకర్ లభ్యంకానుంది.
వివిధ ఎక్స్ క్లూజివ్ ఆఫర్లను కూడా షియోమి ప్రకటించింది. షియోమి మి5 గోల్డ్ వేరియంట్ కొనుగోలు చేస్తే.. ఉచితంగా మి ఇన్-ఇయర్ హెడ్ ఫోన్స్ ప్రో గోల్డ్ ను పొందవచ్చు. అదేవిధంగా షియోమి మి 4ఐ కు ఉచిత యూఎస్బీ కేబుల్, యూఎస్బీ ఫ్యాన్ ను వినియోగదారులకు అందించనుంది. ఆశ్చర్యకరంగా ఒక మి టీవీని ర్యాండమ్ గా ఎంపికచేసిన కొనుగోలుదారుడికి ఆఫర్ గా ఇవ్వనుంది. వారు కచ్చితంగా మి స్టోర్ యాప్ లో కొనుగోలు చేసిన వారై ఉండాలి.
మి 3 స్మార్ట్ ఫోన్ ఆవిష్కరణతో 2014లో షియోమి భారత మార్కెట్లోకి ప్రవేశించింది. "యాపిల్ ఆఫ్ చైనా" నిక్ నేమ్ తో అత్యధిక వినియోగదారులను సొంతం చేసుకుంది. మార్కెట్లోకి ప్రవేశించిన ఏడాదిన్నర సమయంలోనే మూడు మిలియన్ల స్మార్ట్ ఫోన్లను షియోమి విక్రయించింది.