కుప్పంలో పోలీసుల విచారణ
కుప్పం : కుప్పం సర్కిల్ కార్యాలయంలో గురువారం పోలీసులు విచారణ చేపట్టారు. ఏఎస్పీ అభిషేక్ మొహంతి, చిత్తూరు ఎస్బీఐ ఎస్ఐ రవిబాబు, చిత్తూరు ఏఎస్ఐ వసంత కుప్పం చేరుకుని సీఐ కార్యాలయంలో ఉదయం 9.20 గంటల నుంచి 5 గంటలు విచారణ చేపట్టారు. కుప్పం సర్కిల్లోని మహిళా కానిస్టేబుల్‌తో పాటు ఎస్ఐలు, పలువురు సిబ్బందితో మాట్లాడారు.
సీఐ రాజశేఖర్ మహిళా కానిస్టేబుల్ నిర్మలను వేధింపులకు గురిచేశారా, ఈ వేధింపులకు తట్టుకోలేక ఓ మహిళా కానిస్టేబుల్ రైలుకింద పడి ఆత్మహత్యాయత్నం చేసుకునేందుకు ప్రయత్నం చేసిందా, సిబ్బందిపై సీఐ ప్రవర్తన ఎలా ఉంటుంది తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీసీ కెమెరాల ప్రత్యేక ఛాంబర్లో విచారణ చేపట్టారు. విచారణకు సంబంధించి ఎలాంటి విషయాలు బయటకు రాలేదు.