కాంట్రాక్టర్లో కదలిక
గద్వాల, న్యూస్‌లైన్: నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో మూడేళ్ల క్రితం పనులను నిలిపేసిన కాంట్రాక్టర్.. అధికారుల నోటీసులు, చర్చలతో ఎట్టకేల కు స్పందించి పనులు చేపట్టేందుకు అంగీకరించారు. ఈ మేరకు గ త రెండురోజులుగా పనులు నిలిచిపోయిన ప్రాంతాలకు యంత్రాలను తరలించడంతో పాటు కార్మికులు ఉండేందుకు షెడ్ల నిర్మాణం చేపడుతున్నారు. మరోవారం రోజుల్లో ఈ ప్యాకేజీల వద్ద పనులు ప్రారంభిస్తారని అధికారులు పేర్కొన్నారు. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం పనులు నిర్వహించేందుకు పది ప్యాకేజీలుగా విభజించా రు. ఇందులో 101, 108 ప్యాకేజీ పనులను క్రాంతి కన్స్ట్రక్షన్స్ కం పెనీ చేపట్టింది. ఈ పనులను రూ.115 కోట్ల అంచనా వ్యయంతో పూర్తి చేయాల్సి ఉంది. 2006లో పనులు ప్రారంభించి 2009 వరకు కొనసాగించారు.
అనంతరం బిల్లుల సమస్య, తదుపరి భూసేకరణ సమస్యలతో అర్ధంతరంగా ఆగిపోయాయి. మళ్లీ పనులను ప్రా రంభించేందుకు రాకుండా పూర్తి నిర్లక్ష్యం వ హించారు. దీంతో అధికారులు పలుమార్లు నోటీసులు జారీచేసినా స్పందించలేదు. చివరకు విసిగివేసారిన ఉన్నతాధికారులు గతనె ల రెండో వారంలో క్రాంతి కన్స్ట్రక్షన్స్ కంపెనీకి 61 ఫైనల్ నోటీసును జారీచేశారు. ఈ నోటీసు ప్రకారం సెప్టెంబర్ 30 నాటికి పను లు చేసేందుకు అంగీకరించడం, చేయని ప క్షంలో కాంట్రాక్ట్‌ను రద్దుచేయాల్సి ఉంటుం దని హెచ్చరించడంతో సదరు కాంట్రాక్టర్ స్పందించి అధికారులతో సంప్రదింపులు ని ర్వహించారు.
చర్చలు సఫలం కావడంతో వారంరోజుల క్రితం నెట్టెంపాడు ప్యాకేజీ ప నులను ప్రారంభించేందుకు కాంట్రాక్టర్ అం గీకరించారు. ఈ మేరకు రెండు ప్యాకేజీల వ ద్దకు యంత్రసామగ్రిని ఇప్పటికే చేర్చారు. త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి. ఈ విషయమై జూరాల ఎస్ఈ ఖగేందర్‌ను ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా.. పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్ అంగీకరించారని, రోజుల వ్యవధిలో పనులు పూర్తిస్థాయిలో ప్రారంభమవుతాయని తెలిపారు. నెట్టెంపాడు అన్ని ప్యాకేజీల్లోనూ పెండింగ్ పనులను వీలైనంత త్వరగా పూర్తిచేసేలా ప్రాధాన్యత క్రమంలో పనులు నిర్వహిస్తున్నామని ఎస్ఈ వివరించారు.