Officials Neglect
-
Hyderabad: పెను గాలులు, జడివానలకు దడ పుట్టిస్తున్న శిథిల భవనాలు
సాక్షి, హైదరాబాద్: పెను గాలులకు హోర్డింగ్‌లు.. జడివానలకు శిథిల భవనాలు కుప్పకూలడం తెలిసిందే. ఈ సమస్యల పరిష్కారానికి ఆయా సీజన్లు రావడానికి ముందే తగిన చర్యలు చేపట్టాలి. కానీ, జీహెచ్ఎంసీలో మాత్రం సీజన్లు వచ్చేంతవరకూ అశ్రద్ధ వహించడం.. ప్రమాదాలు జరిగినప్పుడు హడావుడి చేయడం తంతుగా మారింది. జీహెచ్ఎంసీలో శిథిల భవనాలను వర్షాకాలం వచ్చేలోగా కూల్చివేయడమో, మరమ్మతులు చేయడమో, వాటిలో ఉంటున్న వారిని ఖాళీ చేయించడమో చేయాలి. కానీ ఇందుకు గత కొన్నేళ్లుగా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆచరణలో విఫలమవుతున్నారు. యంత్రాంగం విఫలం.. వరుస వర్షాలతో నగరంలోని శిథిల భవనాలు భయంగొల్పుతున్నాయి. నగరంలో ప్రతియేటా వర్షాల సమయంలో పురాతన భవనాలు కూలి ప్రమాదాలు జరుగుతున్నా తగిన చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారు. శిథిల భవనాలపై చర్యలు తీసుకుంటున్నట్లు ప్రక టిస్తున్నప్పటికీ తూతూమంత్రంగా కొద్దిమేర చర్యలతో సరిపెడుతున్నారు. బలహీనుల దగ్గర ప్రభావం చూపిస్తున్నప్పటికీ, బలవంతుల భవనాల విషయంలో ఏమీ చేయలేకపోతున్నారు. ఈ ఏడాది సైతం ఇప్పటి వరకు 128 శిథిల భవనాలను కూల్చివేసినట్లు అధికారులు పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారుల లెక్కల మేరకే చర్యలు తీసుకోవాల్సినవి ఇంకా 257 శిథిల భవనాలు ఉన్నాయి. వారి లెక్కలోకి రానివి ఇంకా ఎక్కువే ఉంటాయి. నగరంలో ప్రతిసంవత్సరం కూడా జూలై నుంచి అక్టోబర్ మధ్య భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే శిథిలావస్థకు చేరిన వాటికి ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహించాలన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఇరుకు గల్లీల్లో 20 గజాల స్థలంలోనే అయిదంతస్తులు నిర్మించిన భవనాలు సైతం నగరంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా జీహెచ్ఎంసీ అధికారులు శిథిల భవనాలకు సంబంధించి వేగిరం తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. సెల్లార్ల తవ్వకాలపైనా చర్యలు.. సెల్లార్ల నిర్మాణాల విషయంలోనూ తగిన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించేవారిపై చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. ఈ సంవత్సరం ఇలా.. ► నగరంలో శిథిల భవనాలు మొత్తం: 584 ► కూల్చినవి: 128 ► మరమ్మతులు చేసినవి, లేదా ఖాళీ చేయించినవి:199 ► చర్యలు తీసుకోవాల్సినవి: 257 -
ఒచ్చిర్రు.. కూసుర్రు.. పోయిర్రు..
సాక్షి, శామీర్‌పేట్: ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే మండల సాధారణ సర్వసభ్య సమావేశం సోమవారం తూతూమంత్రంగా జరిగింది. సభలో సమస్యల గురించి చర్చించి.. ఆ సమస్యల సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సిన ప్రజాప్రతినిధులు, అధికారులు బాధ్యతా రాహిత్యంగా కనిపించారు. వీరి తీరుపై పలువురు సభ్యులు అసహనం వ్యక్తం చేయడంతో సభ రసాబాసగా మారింది. పదవి అంటే అనుభవించడం కాదు అది ఒక బాధ్యత (దేశ సేవ) అని తెలుసుకున్న నాడే గ్రామాల అభివృద్ధి సాధ్యం అవుతుందనేది గమనించాలి. సభా దృష్టికి వచ్చిన విషయాలు.. మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు దాసరి యెళ్ళుబాయి అధ్యక్షతన సోమవారం శామీర్‌పేట మండల సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సభ్యులు పలు సమస్యలను సభా దృష్టికి తీసుకొచ్చారు. చదవండి: నాడు డెల్టా.. నేడు ఒమిక్రాన్.. వెంటాడుతున్న కరోనా వైరస్ గుబులు ♦ మజీద్‌పూర్ ప్రభుత్వ పాఠశాలలో రెండ్డు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వాటిని వెంటనే భర్తీ చేయాలని సర్పంచ్ మోహన్‌రెడ్డి సభా దృష్టికి తీసుకొచ్చారు. ♦ ప్రజయ్‌హోమ్స్‌లో మురుగుతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. సమస్యను గ్రామ పంచాయతీ దృష్టికి తీసుకెళ్లినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఎంపీటీసీ అశోక్‌రెడ్డి ఆరోపించారు. ♦ కరోనా రెండో డోస్ వేసుకోని వారు ముందుకొచ్చి వ్యాక్సిన్ తీసుకునేలా గ్రామాల్లో అవగాహన కల్పించాలని మండల వైద్యాధికారులు కోరారు. ♦ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారానికి నోచుకోవడం లేదని సభ్యులు అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ♦ ప్రజల ఓటేస్తే గెలిచిన తాను ప్రజా సమస్యలు పరిష్కరించలేనప్పుడు ఈ ఎంపీటీసీ పదవి ఎందుకని అలియాబాద్ ఎంపీటీసీ కోడూరి అశోక్ సభలో ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, సర్పంచ్ల గైర్హాజరు... సోమవారం 11 గంటలకు ప్రారంభం కావాల్సిన సభ అధికారులు, పలువురు సభ్యులు ఆలస్యంగా రావడంతో సుమారు 35 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమయ్యింది. కొందరు మండల స్థాయి అధికారుల గైర్హాజరు అయ్యారు. శామీర్‌పేట మండలంలోని 10 మంది సర్పంచ్‌లలో నలుగురు సర్పంచ్‌లే హాజరవడం గమనార్హం. చదవండి:హైదరాబాద్: ఆరేళ్లలో కొట్టేసిన మొత్తం అక్షరాలా రూ.4,611 కోట్లు సెల్ఫోన్లతో అధికారుల కాలక్షేపం... సభ్యులు సభా దృష్టికి తీసుకొచ్చే సమస్యలను నోట్ చేసుకొని వాటి పరిష్కారానికి కృషి చే యాల్సిన అధికారులు సెల్ఫోన్లతో కాలక్షేపం చేశారు. బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తున్న పంచాయతీ కార్యదర్శులు, అధికారులపై ఉన్నతస్థాయి అధికారులు క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని పలువురు సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. పదవీ అంటే పదవీ అంటే అనుభవించడమా.? దీనిని బట్టి ప్రజాసమస్యల పరిష్కారానికి వీళ్లు ఎంత మేరా కృషి చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. సర్పంచ్ పదవి అంటే అనుభవించడమని వారు అనుకోవడం దురదృష్టకరం అని పలువురు సభ్యులు పేర్కొంటున్నారు. ప్రజా సమస్యలను సభా దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలనే సోయ ప్రజాప్రతినిధులకు లేనప్పుడు గ్రామాల అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నిస్తున్నారు. -
జలమేది.. జీవమేది !
- చెరువులకు చేరని తాగునీరు - మూడు రోజుల కిందటే విడుదల చేశామంటున్న అధికారులు - రెండు దశాబ్దాల తరువాత అడుగంటిన మల్లేశ్వరం మంచినీటి చెరువు - తీరంలో తాగునీటి పాట్లు తప్పవా..? మచిలీపట్నం : అధికారుల నిర్లక్ష్యం, ముందుచూపు లోపించడం వెరసి తీరప్రాంత ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పేలా లేదు. తాగునీటి అవసరాల నిమిత్తం మూడు రోజుల కిందట కాలువలకు నీటిని విడుదల చేసినట్లు అధికారులు చెబుతున్నా అవి ఇంకా శివారు ప్రాంతాలకు చేరనేలేదు. చెరువులు నింపే పనిని పంచాయతీ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చేయాల్సి ఉన్నా ఎవరికి వారు తమది కానట్లు వ్యవహరిస్తుండటం గమనార్హం. పంచాయతీలే తాగునీటి చెరువులను నింపుకోవాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చెబుతున్నారు. విడతలవారీగా ఆయా కాలువలకు తాగునీటి అవసరాల నిమిత్తం నీటిని విడుదల చేసినట్లు నీటిపారుదల శాఖ అధికారులు ప్రకటన చేశారు. ► రైవస్ కాలువ కింద 269 మంచినీటి చెరువులు ఉండగా ఇప్పటివరకు ఆ కాలువకు చుక్కనీరు విడుదల చేయలేదు. ఏలూరు కాలువకు తాగునీటిని విడుదల చేసినా మంగళవారం సాయంత్రానికి పెరికీడు వరకు మాత్రమే చేరింది. ► అవనిగడ్డ నియోజకవర్గానికి తాగునీటి అవసరాల కోసం కేఈబీ కాలువకు నీటిని విడుదల చేసినా పులిగడ్డ అక్విడెక్టును దాటి చుక్కనీరు దిగువకు వెళ్లలేదు. ► బందరు కాలువకు మూడు రోజుల కిందట నీటిని విడుదల చేయగా తరకటూరు సమ్మర్ స్టోరేజీ ట్యాంకును నింపుతున్నారు. ఈ ట్యాంకు పూర్తిస్థాయిలో నిండుతుందనే నమ్మకం లేని పరిస్థితి నెలకొంది. కాలువలకు సక్రమంగా నీటి విడుదల చేయని నేపథ్యంలో చెరువులు నింపటం సాధ్యం కాదని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు అంటున్నారు. పూర్తిగా ఎండిన మల్లేశ్వరం మంచినీటి చెరువు ► బంటుమిల్లి మండలంలోని మల్లేశ్వరం రక్షిత మంచినీటి పథకాన్ని 1995లో నిర్మించారు. అప్పటి నుంచి ఈ చెరువు అడుగంటలేదు. ఈ సారి అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఫిబ్రవరి నెలలోనే ఈ చెరువు అడుగంటి నెర్రలిచ్చింది. దీంతో 17 గ్రామాల ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి తాగునీటిని తెచ్చుకుంటున్నారు. రైవస్ కాలువ ద్వారా వచ్చే నీటిని ఈ చెరువులో నింపాలి. ఈ చెరువును ఎప్పటికి నింపుతారు, ఎన్ని రోజుల పాటు నీటి సరఫరా జరుగుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ చెరువు ద్వారా చినపాండ్రాక, ఇంతేరు, నాగేశ్వరరావుపేట, కొర్లపాడు, మల్లేశ్వరం, బంటుమిల్లి తదితర గ్రామాలకు తాగునీటిని సరఫరా చేయాల్సి ఉంది. ► కృత్తివెన్ను మండలంలో తాగునీటి చెరువులన్నీ పూర్తిస్థాయిలో ఎండిపోయాయి. సముద్రానికి సమీపంలో ఉన్న పల్లెపాలెం, లక్ష్మీపురం, గరిసిపూడి, కొమాళ్లపూడి, మాట్లం తదితర పంచాయతీల్లోని చెరువులన్నీ ఎండిపోయాయి. ఎప్పటికి కాలువలకు నీరు వస్తుందనేది తెలియని స్థితి. శీతనపల్లి మెగా రక్షిత మంచినీటి పథకం చెరువులోనూ నీరు అడుగంటే స్థితికి చేరింది. 20 రోజులు మాత్రమే ప్రస్తుతం ఈ నీరు వచ్చే అవకాశం ఉంది. గత వేసవిలో ఈ చెరువును నింపకుండానే మమ అనిపించారు. అక్విడెక్టు దాటని నీరు తీరప్రాంతంలో ఉన్న అవనిగడ్డ నియోజకవర్గంలో తాగునీటి చెరువులు నింపే విషయంపై అధికారులు కినుకు వహిస్తున్నారు. కేఈబీ కాలువ ద్వారా నాగాయలంక, కోడూరు, అవనిగడ్డ మండలాలకు నీటిని వదలాల్సి ఉంది. చల్లపల్లి, మోపిదేవి, ఘంటసాల మండలాల పరిధిలో 10 తాగునీటి చెరువులు ఉండగా నాగాయలంక, కోడూరు, అవనిగడ్డ మండలాల్లో 50కు పైగా తాగునీటి చెరువులు ఉన్నాయి. కేఈబీ కాలువ ద్వారా వచ్చిన నీటిని పులిగడ్డ అక్విడెక్టు వద్ద నిలిపివేశారు. శివారున ఉన్న మండలాలకు ఈ నెల 16 నుంచి 21వ తేదీ వరకు తాగునీటిని విడుదల చేస్తామని చెబుతున్నారు. నాగాయలంక మండలం కమ్మనమోలు మంచినీటి పథకం ద్వారా ఎనిమిది పంచాయతీలకు తాగునీటిని విడుదల చేయాల్సి ఉంది. కాలువకు నీటిని విడుదల చేస్తే కమ్మనమోలు మంచినీటి చెరువు వరకు నీరు వెళుతుందా, లేదా అనేది అధికారులకే అర్థం కాని పరిస్థితి. గత ఏడాది ఈ చెరువుకు కాలువ నీరు చేరకుండానే గడిచిపోయింది. -
పుష్కర ఏర్పాట్లపై అధికారుల నిర్లక్ష్యం
-
8 గంటలు కరెంట్ కట్
బెల్లంపల్లి, న్యూస్‌లైన్ : విద్యుత్ లైన్లో ఏ ర్పడిన సాంకేతిక సమస్యతో తూర్పు ప్రాం తంలోని పది మండలాల్లో శనివారం గంట ల కొద్ది విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 9 గంట ల వరకు కరెంట్ సరఫరా పూర్తిగా స్తంభించడంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లకు లోనయ్యారు. కాసిపేట మండలం కొండాపూర్ ఫీడర్ లో 33 కేవీ లైన్లో రెండు డిస్క్‌లు ఫెయిలవడమే ఇందుకు కారణం. వీటి మరమ్మతు పేరిట బెల్లంపల్లి నుంచి మండలాలకు వెళ్లే 132 కేవీ ప్రధాన విద్యుత్ లైన్ కరెంట్ సరఫరాను నిలిపివేశారు. ఈ కారణంగా భీమి ని, నెన్నెల, తాండూర్, బెల్లంపల్లి, తిర్యాణి, వాంకిడి, ఆసిఫాబాద్, రెబ్బెన, కెరమెరి, కాసిపేట మండలాల్లోని వందకుపైగా గ్రామాలకు కరెంట్ సరఫరా నిలిచింది. అల్లాడిన జనం కరెంట్ సరఫరా ఆగిపోవడంతో ప్రజలు నానా యాతన పడ్డారు. మధ్యాహ్నం ఉక్కపోతతో బాధపడిన ప్రజలు రాత్రి దోమల రోదతో సతమతమయ్యారు. కరెంట్ లేక ఫ్యాన్లు పని చేయని పరిస్థితులు ఏర్పడి చి న్నారులు నిద్రకు దూరమయ్యారు. కరెంట్ లేక ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, జిరాక్స్ సెంట ర్లు, రైస్ మిల్లులు, వెల్డింగ్ షాపుల యజ మానులు ఖాళీగా ఉండాల్సి వచ్చింది. బెల్లంపల్లిలోని బజార్ ఏరియా, కాల్టెక్స్, రైల్వేస్టేషన్ ప్రాంతాలు పూర్తిగా చీకటిమయమయ్యాయి. వాహనాల రాకపోకలతో రహదారిపై కాస్తా వెలుతురు కనిపించిన కార్మికేతర వాడలలో మాత్రం చీకటి రాజ్యమేలింది. గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉండిపోయింది. ఎటు చూసిన చీకటి అలుముకోవడంతో ప్రజలు క్యాండీ ల్స్, కిరోసిన్ బుడ్డిలతో కాలం గడిపారు. మరమ్మతుల్లో నిర్లక్ష్యం పాడైపోయిన డిస్క్‌లను తొలగించి కొత్త వా టిని ఏర్పాటు చేయడానికి అధికారులు గం టలకొద్దీ సమయం వృథా చేశారు. కేవలం రెండు గంటల వ్యవధిలో మరమ్మతు పూర్తి చేసే అవకాశాలున్నా అధికారుల నిర్లక్ష్యంతో 9 గంటలకు పైగా సమయం గడిచిపోయిం ది. ఎట్టకేలకు చివరికి రాత్రి 9 గంటల తర్వా త విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. విద్యుత్ లైన్లను పర్యవేక్షించి ఎప్పటికప్పుడు మరమ్మతు చేయించాల్సి ఉండగా ట్రాన్స్‌కో అధికారులు విధి నిర్వహణలో తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తున్నారు. ఏదేని సమస్య ఏర్పడినప్పుడు కూడా అదే ధోరణి ప్రదర్శిస్తున్నారు. అధికారుల తీరులో మార్పు రావాలని, కరెంటు సమస్యలు కలుగకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.