బెల్లంపల్లి, న్యూస్‌లైన్ : విద్యుత్ లైన్‌లో ఏ ర్పడిన సాంకేతిక సమస్యతో తూర్పు ప్రాం తంలోని పది మండలాల్లో శనివారం గంట ల కొద్ది విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 9 గంట ల వరకు కరెంట్ సరఫరా పూర్తిగా స్తంభించడంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లకు లోనయ్యారు. కాసిపేట మండలం కొండాపూర్ ఫీడర్ లో 33 కేవీ లైన్‌లో రెండు డిస్క్‌లు ఫెయిలవడమే ఇందుకు కారణం.
వీటి మరమ్మతు పేరిట బెల్లంపల్లి నుంచి మండలాలకు వెళ్లే 132 కేవీ ప్రధాన విద్యుత్ లైన్ కరెంట్ సరఫరాను నిలిపివేశారు. ఈ కారణంగా భీమి ని, నెన్నెల, తాండూర్, బెల్లంపల్లి, తిర్యాణి, వాంకిడి, ఆసిఫాబాద్, రెబ్బెన, కెరమెరి, కాసిపేట మండలాల్లోని వందకుపైగా గ్రామాలకు కరెంట్ సరఫరా నిలిచింది.
అల్లాడిన జనం
కరెంట్ సరఫరా ఆగిపోవడంతో ప్రజలు నానా యాతన పడ్డారు. మధ్యాహ్నం ఉక్కపోతతో బాధపడిన ప్రజలు రాత్రి దోమల రోదతో సతమతమయ్యారు. కరెంట్ లేక ఫ్యాన్లు పని చేయని పరిస్థితులు ఏర్పడి చి న్నారులు నిద్రకు దూరమయ్యారు. కరెంట్ లేక ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, జిరాక్స్ సెంట ర్లు, రైస్ మిల్లులు, వెల్డింగ్ షాపుల యజ మానులు ఖాళీగా ఉండాల్సి వచ్చింది.
బెల్లంపల్లిలోని బజార్ ఏరియా, కాల్‌టెక్స్, రైల్వేస్టేషన్ ప్రాంతాలు పూర్తిగా చీకటిమయమయ్యాయి. వాహనాల రాకపోకలతో రహదారిపై కాస్తా వెలుతురు కనిపించిన కార్మికేతర వాడలలో మాత్రం చీకటి రాజ్యమేలింది. గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉండిపోయింది. ఎటు చూసిన చీకటి అలుముకోవడంతో ప్రజలు క్యాండీ ల్స్, కిరోసిన్ బుడ్డిలతో కాలం గడిపారు.
మరమ్మతుల్లో నిర్లక్ష్యం
పాడైపోయిన డిస్క్‌లను తొలగించి కొత్త వా టిని ఏర్పాటు చేయడానికి అధికారులు గం టలకొద్దీ సమయం వృథా చేశారు. కేవలం రెండు గంటల వ్యవధిలో మరమ్మతు పూర్తి చేసే అవకాశాలున్నా అధికారుల నిర్లక్ష్యంతో 9 గంటలకు పైగా సమయం గడిచిపోయిం ది. ఎట్టకేలకు చివరికి రాత్రి 9 గంటల తర్వా త విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
విద్యుత్ లైన్లను పర్యవేక్షించి ఎప్పటికప్పుడు మరమ్మతు చేయించాల్సి ఉండగా ట్రాన్స్‌కో అధికారులు విధి నిర్వహణలో తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తున్నారు. ఏదేని సమస్య ఏర్పడినప్పుడు కూడా అదే ధోరణి ప్రదర్శిస్తున్నారు. అధికారుల తీరులో మార్పు రావాలని, కరెంటు సమస్యలు కలుగకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
8 గంటలు కరెంట్ కట్
Published Sun, Feb 9 2014 6:19 AM | Last Updated on Sat, Sep 2 2017 3:31 AM
Advertisement
Advertisement