Oil depot
-
Russia-Ukraine War: ఉక్రెయిన్‌పై ఆగని బాంబుల వర్షం
బుచా/కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఒడెసా సమీపంలో ఆదివారం క్షిపణుల వర్షం కురిపించాయి. ఉక్రెయిన్ సైన్యం ఉపయోగిస్తున్న చమురు శుద్ధి కర్మాగారాన్ని, మూడు చమురు డిపోలను ధ్వంసం చేశామని రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. కోస్తియాన్టినివ్కా, ఖ్రేసిచేలో ఆయుధ డిపోలను సైతం ధ్వంసం చేశామని తెలియజేసింది. మారియుపోల్ నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఖర్కీవ్‌పై 20 వైమానిక దాడులు జరిగాయి. బలాక్లియా పట్టణంలో ఆసుపత్రిపై రష్యా క్షిపణి దాడికి పాల్పడింది. మరోవైపు ఇరు దేశాల మధ్య చర్చలు సోమవారం మళ్లీ మొదలవనున్నాయి. బుచాలో దారుణ దృశ్యాలు కొన్ని వారాలుగా రష్యా సైన్యం నియంత్రణలో ఉన్న రాజధాని కీవ్ ఉత్తర ప్రాంతాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకున్నామని ఉక్రెయిన్ సైన్యం ప్రకటించింది. కీవ్‌కు 37 కిలోమీటర్ల దూరంలో ఉన్న బుచా పట్టణం ఇప్పటికే ఉక్రెయిన్ అధీనంలోకి వచ్చింది. అక్కడ శవాలు వీధుల్లో చెల్లాచెదురుగా దర్శనమిచ్చాయని మీడియా ప్రతినిధలు చెప్పారు. వాటికి సామూహిక అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. తూర్పు ప్రాంతంలో రష్యా భారీగా సైన్యాన్ని మోహరిస్తోంది. ఉత్తర ఉక్రెయిన్ నుంచి సైన్యాన్ని పూర్తిగా ఉపసంహరించింది. ఉక్రెయిన్‌లో మందుపాతర్ల బెడద రష్యా జవాన్లు తమ భూభాగంలో ఎక్కడిక్కడ మందుపాతరలు ఏర్పాటు చేశారని అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. రోడ్లపై, వీధుల్లో, ఇళ్లలో, అఖరికి శవాల లోపలా మందుపాతరలు పె ట్టారన్నారు. మరిన్ని ఆధునిక ఆయుధాలు, యుద్ధ విమానాలివ్వాలని పశ్చిమ దేశాలను కోరారు. రంజాన్‌పై యుద్ధ ప్రభావం యుద్ధంతో చమురు, నిత్యావసరాల ధరలు భారీగా పెరిగినందున ఈసారి రంజాన్ జరుపుకోవడం కష్టమేనని లెబనాన్, ఇరాక్, సిరియా, సూడాన్, యెమెన్ తదితర దేశాల్లో జనం వాపోతున్నారు. వాటికి గోధుమలు, బార్లీ గింజలు, నూనె గింజలు రష్యా, ఉక్రెయిన్ నుంచే వెళ్తాయి. లిథువేనియాకు చెందిన ప్రముఖ సినీ దర్శకుడు రావిసియస్ మారియుపోల్‌లో కాల్పుల్లో మృతి చెందారు. రష్యా సైన్యంలో తిరుగుబాటు! సుదీర్ఘ యుద్ధంతో ఉక్రెయిన్‌లో రష్యా సైనికులు నీరసించిపోతున్నట్లు చెప్తున్నారు. ముందుకెళ్లడానికి వారు ససేమిరా అంటున్నారు. సొంత వాహనాలు, ఆయుధాలనూ ధ్వంసం చేస్తున్నారు. ఉన్నతాధికారుల ఉత్తర్వులను లెక్కచేయడం లేదు. సైనికుల్లో తిరుగుబాటు మొదలైందని, పుతిన్ మొండిపట్టుపై వారు రగిలిపోతున్నారని ఉక్రెయిన్ అంటోంది. ‘‘సహచరుల మరణాలు రష్యా సైనికులను కలచివేస్తున్నాయి. స్థైర్యం సన్నగిల్లి ఆస్త్ర సన్యాసం చేస్తున్నారు’’ అరని నాటో కూటమి అంటోంది. యుద్ధానికి రష్యా సైన్యం విముఖత వ్యక్తం చేయడం ఇదే మొదటిసారి కాదు. 1905 జూన్‌లో రూసో–జపనీస్ యుద్ధంలోనూ వారు ఇలాగే సహాయ నిరాకరణ చేశారు. ఉన్నతాధికారులపై తిరగబడ్డారు. వారి ఆదేశాలను ధక్కిరించారు. -
రష్యాపై దాడి మొదలుపెట్టిన ఉక్రెయిన్.. చమురు డిపో ధ్వంసం
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం శుక్రవారంతో 37వ రోజుకు చేరుకుంది. ఉక్రెయిన్‌లోని ఖార్కీవ్, మారియుపోల్ వంటి కీలక నగరాలపై రష్యా బాంబు దాడులు జరుపుతోంది. ఈ యుద్ధంలో రెండు దేశాల సైన్యంతో పాటు వేలాది పౌరులు అన్యాయంగా బలైపోతున్నారు. భారీగా ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లుతోంది. అయితే రష్యా కుతంత్రాలకు పాల్పడుతున్నదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. రష్యా దురాక్రమణనుంచి తన దేశాన్నిన రక్షించుకోవడం ప్రస్తుతం కీలక దశకు చేరుకుందని ఆయన తెలిపారు. రష్యా దాడులకు ప్రతిస్పందనగా, ఉక్రెయిన్ సైన్యం తొలిసారి రష్యాపై దాడికి దిగింది. రష్యా భూభాగంలోని పశ్చిమ బెల్గోరోడ్ నగరంలోని చమురు డిపోపై ఉక్రెయిన్‌కు చెందిన రెండు హెలికాప్టర్లు వైమానిక దాడి చేశాయని రష్యన్ అధికారులు శుక్రవారం తెలిపారు. ఉక్రెయిన్ సరిహద్దుకు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెల్గోరోడ్లో శుక్రవారం ఉదయం ఈ బాంబు దాడి ఘటన జరిగినట్లు పేర్కొన్నారు. వైమానిక దాడితో భారీగా మంటలు వ్యాపించాయని, ఇద్దరు వ్యక్తులు గాయపడినట్లు తెలిపారు. 170 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపుచేసినట్లు చెప్పారు. సిబ్బందిని అక్కడి నుంచి వెంటనే ఖాళీ చేయించినట్లు రష్యా మంత్రిత్వశాఖ పేర్కొంది. చదవండి: Pakistan PM: ఓ పవర్ఫుల్ దేశం భారత్‌కు అండగా ఉంది.. Video of the two Ukrainian Mi-24 helicopters striking the oil storage facility in Belgorod with rockets. https://t.co/4Lt5l1Xc3S pic.twitter.com/d5zj4GWjou — Rob Lee (@RALee85) April 1, 2022 అయితే ఈ ఘటన రష్యా ఉక్రెయిన్ ప్రతినిధుల మధ్య జరుగుతున్న చర్చలకు ఆటంకం కలిగించవచ్చని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ తెలిపారు. చమురు డిపోపై దాడి.. ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధాన్ని తీవ్రతరం చేయవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఇదిలా ఉండగా రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ శుక్రవారం న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, భారత విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్‌లతో సమావేశమయ్యారు. చదవండి: Putin: మొండి పుతిన్‌కు పెరిగిన మద్దతు.. ఆదరణ! -
లిబియాలో అగ్ని కీలలు
ట్రిపోలి: లిబియా రాజధాని ట్రిపోలీ సమీపంలో ఓ చమురు డిపోలో లేచిన మంటలు అదుపులోకి రాలేదు. వీటిని ఆర్పడానికి అగ్నిమాపక దళాలు నిరంతరాయంగా కృషి చేసిన ఫలితం దక్కలేదు. నీటి నిల్వలు కూడా అడుగంటాయి. దీంతో సమీప ప్రాంతాల్లోని ప్రజలను రోడ్డు, వాయు మార్గంలో తరలించేందుకు అధికారులు తక్షణ చర్యలు చేపట్టారు. ఈ ప్రాంతంలో గత రెండు వారాలుగా తీవ్రవాదులు పరస్పరం దాడులు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ట్రిపోలీకి 10 కిలోమీటర్ల దూరం లో ఉన్న చమురు డిపోపై ఆదివారం రాకెట్ పడడంతో మంటలు తలెత్తాయి. 60లక్షల లీటర్ల చమురు ఇక్కడ నిల్వ ఉండడంతో మంటలు ఎగసి పడుతున్నాయి. ఈ ఆవరణలోనే ఉన్న 9 కోట్ల లీటర్ల సహజవాయువు కేంద్రానికి కూడా మంటలు వ్యాపిస్తాయేమోననే ఆందోళనలో అధికారులు ఉన్నారు. లిబియాలో జరుగుతున్న హింసలో 97 మంది మృతి చెందారు. భారతీయులకు హెచ్చరిక: హింస నేపథ్యంలో లిబియా నుంచి వెళ్లిపోవాలని భారతీయులకు అక్కడి ఎంబసీ హెచ్చరికలు జారీ చేసింది. లిబియా నుంచి వెళ్లిపోవడానికి అన్ని మార్గాలను వినియోగించుకోవాలని... ఘర్షణాత్మక ప్రాంతా ల నుంచి సురక్షిత ప్రదేశాలకు వెళ్లిపోవాలని కోరింది.