oil leakage
-
ఆర్టీపీపీలో విద్యుత్‌కు అంతరాయం
వైఎస్సార్ జిల్లా: ఎర్రగుంట్లలోని రాయలసీమ థర్మల్ పవర్‌ప్లాంట్(ఆర్టీపీపీ)లో విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పాడింది. ఆర్టీపీపీలోని మూడవ యూనిట్లో ఆయిల్ లీకేజీ కారణంగా విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసి మరమ్మతులు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 215 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం కలిగింది. దీని వల్ల రూ.లక్షల్లో నష్టం వాటిల్లినట్లు అధికారులు చెప్పారు. -
డీజిల్ కోసం బిందెలు, బకెట్లతో పరుగులు..
జి.కొండూరు: ఆదివారం మద్యాహ్నం.. కృష్ణా జిల్లా జి.కొండూరు మండలం కట్టుబడిపాలెం.. బిందెలు, బకెట్లు, కుండలు.. ఇలా ఏదిదొరికితే దాన్ని తీసుకుని జనం పరుగులు పెట్టారు. ఎండాకాలం కదా అగ్నిప్రమాదమేదైనా సంభవించిదా.. మంటలు ఆర్పేందుకే వీళ్లు వెళుతున్నారా? అని చూసేవాళ్లు సందేహపడ్డారు. అసలు విషయమేమంటే.. కట్టుబడిపాలెం గ్రామంలోని హెచ్‌పీసీఎల్ కంపెనీకి చెందిన పైపులైన్లు లీకై వాటినుంచి డీజిల్ అంతెత్తున ఎగిసిపడింది. అసలే డీజిల్ రేట్లు మండిపోతున్న తరుణంలో దానిని తెచ్చుకునేందుకు జనం ఇలా పరుగులు పెట్టారు. హెపీసీఎల్ కంపెనీ స్టోరేజీ ట్యాంకర్ల సమీపంలో పైపులైన్ నుంచి భూమిపైకి డీజిల్ చొచ్చుకొచ్చి సమీప డ్రైనీజీలో కలిసినట్టు గుర్తించిన కొందరు తమవారికి సమాచారం ఇవ్వడంతో ఈ పరుగుల ప్రహాసనం మొదలైంది. చివరికి అధికారులు చేరుకుని మరమ్మతులు చేసి ఆయిల్ లీకేజీని నియంత్రించారు. పైపులైన్ అడుగు భాగంలో దెబ్బతినడం వల్లే లీకేజీ చోటు చేసుకుందని చెప్పారు. ఇదే ప్రాంతంలో గతంలో రెండు సార్లు లీకేజీలు చోటు చేసుకున్నాయి. -
మరో జర్మన్వింగ్స్ విమానానికి తప్పిన ముప్పు
కోపైలట్ దుశ్చర్యతో ఆల్ఫ్స్ పర్వతాల్లో విమానం కుప్పకూలి 150 మంది మరణించిన ఘటన మరువకముందే జర్మన్వింగ్స్ సంస్థకు చెందిన మరో విమానానికి భారీ ముప్పు తప్పింది. స్థానిక కాలమానం ప్రకారం శనివారం ఉదయం కొలోన్ నుంచి వెనిస్కు టేకాఫ్ అయిన ఎయిర్‌బస్ ఏ 319 విమానంలో ఆయిల్ లీక్ అవుతోందని పైలట్ భావించాడు. దీంతో విమానాన్ని దారి మళ్లించి నైరుతి జర్మనీలోని స్టట్గర్ట్ ఎయిర్ పోర్టులో దింపేశారు. ఆ సమయంలో విమానంలో 123 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బంది ఉన్నారు. టెక్నికల్ ఇంజనీర్లు క్షుణ్ణంగా పరిశీలించి ఆయిల్ లీక్ కావడంలేదని తేల్చిచెప్పినప్పటికీ, ప్రయాణికుల భద్రత దృష్ట్యా వారిని వేరొక విమానంలో వెనిస్కు తరలించినట్లు జర్మన్వింగ్స్ ప్రతినిధులు ప్రకటించారు. వరుస విమాన ప్రమాదాల నేపథ్యంలో జర్మన్వింగ్స్ ఫ్లయిట్లో ఆయిల్ లీకేజీ వార్త అటు అధికారులతోపాటు ఇటు ప్రయాణికుల కుటుంబాలనూ కలవరపాటుకు గురిచేసింది.