Oil Minister
-
భారత్‌లో ‘రిఫరెన్స్’ ఇంధనం ఉత్పత్తి షురూ..
న్యూఢిల్లీ: దేశీయంగా ‘రిఫరెన్స్’ పెట్రోల్, డీజిల్ ఇంధనాల తయారీ ప్రారంభమైంది. తద్వారా ఆటోమొబైల్స్ టెస్టింగ్ కోసం ఉపయోగించే ప్రత్యేక ఇంధనాలను తయారు చేసే దేశాల సరసన భారత్ కూడా చేరింది. చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ఈ ఇంధనాలను ఆవిష్కరించారు. దిగుమతులను తగ్గించుకుని భారత్ స్వావలంబన సాధించే దిశగా రిఫరెన్స్ ఇంధనాల ఉత్పత్తి మరో కీలక అడుగని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మూడు సంస్థలే ఈ ఇంధనాలను తయారు చేస్తున్నాయని, ఇకపై దేశీయంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కూడా వీటిని ఉత్పత్తి చేస్తుందని మంత్రి చెప్పారు. ఐవోసీ తమ పారదీప్ రిఫైనరీలో రిఫరెన్స్ గ్రేడ్ పెట్రోల్‌ను, హర్యానాలోని పానిపట్ యూనిట్లో డీజిల్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఆటోమొబైల్ కంపెనీలు తాము తయారు చేసే వాహనాలను పరీక్షించేందుకు ప్రత్యేక గ్రేడ్ ఇంధనాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. దీన్నే రిఫరెన్స్ ఫ్యూయల్‌గా వ్యవహరిస్తారు. ఇలాంటి అవసరాల కోసం సాధారణ గ్రేడ్ ఇంధనాలు పనికిరావు. సాధారణంగా వీటి అమ్మకాలు పెద్దగా లేనందున దేశీయంగా రిఫైనరీలు ఇప్పటివరకు ఈ ఇంధనాలను ఉత్పత్తి చేయడం లేదు. దీంతో దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోంది. అయితే, తాజాగా ఐవోసీ వీటిని తయారు చేయడం వల్ల రిఫరెన్స్ ఫ్యూయల్ రేట్లు తగ్గగలవు. సాధారణ పెట్రోల్, డీజిల్ రేట్లు లీటరుకు రూ. 90–96 (ఢిల్లీలో) స్థాయిలో ఉండగా.. దిగుమతైన రిఫరెన్స్ ఇంధనం రేటు రూ. 800–850 శ్రేణిలో ఉంటుంది. దేశీయంగానే దీన్ని ఉత్పత్తి చేస్తే లీటరు ధర సుమారు రూ. 450కి తగ్గుతుంది. దేశీయంగా డిమాండ్‌ను తీర్చిన తర్వాత ఐవోసీ ఎగుమతులపైనా దృష్టి పెట్టనుంది. -
జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్: లీ రూ. 43.44
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజు రోజుకు పెరిగి పోతున్నాయి. వినియోగదారుల పాలిట గుదిబండలా తయారయ్యాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తక్కువగానే ఉన్న భారత్‌లో మాత్రం డీజిల్, పెట్రోల్ ధరలు మాత్రం చుక్కలు చూపిస్తున్నాయి. వీటిని నియంత్రించే విధంగా ఇటీవల చమురు శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ కౌన్సిల్ పరిధిలోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు ఆయన తెలిపారు. మంత్రి చెప్పినట్లుగా పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తే పెట్రోల్, డీజిల్ ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ఇప్పుడు ఉన్న జీఎస్టీ స్లాబ్‌లలో అత్యథికంగా ఉన్న 28శాతంలో చేరిస్తే లీటర్ పెట్రోల్ గరిష్టంగా రూ43.44లకే లభిస్తుంది. 18శాతం స్లాబ్‌లో రూ.40.05లకు, 12శాతం స్లాబ్‌లో కనిష్టంగా కేవలం రూ.38.10లకే అందుబాటులోకి వస్తుంది. అలాగే డీజిల్ ధరల్లో కూడా భారీ మార్పులు జరుగుతాయి. 12శాతం స్లాబ్‌లో 36.65, 18శాతం స్లాబ్‌లో రూ.38.61లకే వస్తుంది. 2014 నుంచి కేంద్రం, అంతర్జాతీయం ముడిచమురు ధరలు పతనమైనా ఎక్సైజ్ పన్నును పెంచింది. అన్ని పన్నులతో కలుపుకొని డీజిల్ ఇప్పటి రూ13.47 పెరగగా, పెట్రోల్ రూ.11.77 పెరిగింది. అప్పటి నుంచి ప్రభుత్వానికి ఎక్సైజ్ పన్ను నుంచి వచ్చే ఆదాయం రెట్టింపు అయింది. 2014-15లో ఎక్సైజ్ పన్నుతో రూ.99వేల కోట్లు ఆదాయం రాగా, 2016-17లో సుమారు రెండితలు పెరిగి రూ.2 లక్షల 42 వేల కోట్లకు చేరింది. -
గ్యాస్ ధరపై త్వరగా నిర్ణయం
పెట్రోలియం మంత్రిని కోరిన బీపీ చీఫ్ మాస్కో: కృష్ణా గోదావరి బేసిన్‌లోని కేజీ డీ6 క్షేత్రంలో గ్యాస్ ఉత్పత్తి పెంపునకు గ్యాస్ ధర సవరణ, చట్ట సంబంధ అనుమతులు అవరోధాలుగా మారిన నేపథ్యంలో బ్రిటిష్ పెట్రోలియం (బీపీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ బాబ్ డూబ్లే భారత పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో భేటీ అయ్యారు. మాస్కోలో మంగళవారం ప్రపంచ పెట్రోలియం సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ప్రధాన్‌ను ఆయన కలుసుకున్నారు. గ్యాస్ ధరల పెంపుపై త్వరగా నిర్ణయం తీసుకోవాల్సిందిగా డూబ్లే కోరినట్లు అధికార వర్గాలు తెలిపాయి. కేజీ డీ6తో సహా రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన 21 చమురు, గ్యాస్ బ్లాకుల్లో 30 శాతం వాటాను బీపీ 2011లో 720 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసింది. కేజీ డీ6లో నానాటికీ క్షీణిస్తున్న ఉత్పత్తి పెంపునకు ప్రభుత్వ అనుమతులు జాప్యం కావడం బీపీకి నిరాశ కలిగించింది. గ్యాస్ ధరను గత ఏప్రిల్ 1 నుంచి పెంచాల్సి ఉన్నప్పటికీ పెంచలేదనే విషయాన్ని మంత్రి దృష్టికి డూబ్లే తెచ్చారు. కేజీ డీ6లో ప్రస్తుతం రోజుకు 13 మిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉత్పత్తి అవుతోంది. మూడేళ్ల కిందటి ఉత్పత్తితో పోలిస్తే ఇది కేవలం ఐదో వంతే. ధరల పెంపుపై సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటే తమ పెట్టుబడుల నిర్ణయాలు కొలిక్కి వస్తాయని బీపీ చెబుతోంది. -
ప్రతి బుధవారం మొయిలీ బస్సుప్రయాణం
ఒక్కో మనిషి ఒక్కో కారులో వెళ్తుంటే బోలెడంత పెట్రోలు ఖర్చవుతుంది. అదే 20-30 మంది కలిసి ఒక్క బస్సులో వెళ్తే చాలా ఆదా అవుతుంది. సరిగ్గా ఇదే సూత్రాన్ని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి వీరప్ప మొయిలీ చెబుతున్నారు. చెప్పడమే కాదు, ఆయన దీన్ని స్వయంగా కూడా ఆచరించి చూపిస్తానంటున్నారు. వారానికి ఒకరోజు చొప్పున తాను కేవలం బస్సుల్లోనే ప్రయాణిస్తానని మొయిలీ స్పష్టం చేశారు. అక్టోబర్ 9వ తేదీ నుంచి ప్రతి బుధవారం తాను కారులో ప్రయాణం చేయబోనని, ప్రజారవాణానే వినియోగిస్తానని ఆయన చెప్పారు. చమురు దిగుమతుల బిల్లు 500 కోట్ల డాలర్లకు చేరుకుంటున్నందున దాంట్లో కొంతయినా ఆదా చేయాలంటే అందరూ బస్సుల్లో ప్రయాణించాలని, వీలైనంత వరకు వ్యక్తిగత వాహనాల వాడకాన్ని తగ్గించాలని మొయిలీ పిలుపునిచ్చారు. తనతో పాటు తన మంత్రిత్వశాఖ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేసేవాళ్లు కూడా ప్రతి బుధవారం బస్సుల్లోనే తిరగాలని ఆయన కోరారు.