OJ Simpson
-
అమెరికన్ ఫుట్‌బాల్ దిగ్గజం ఓజే సింప్సన్ కన్నుమూత
లాస్ వేగస్: వివాదాస్పద అమెరికన్ ఫుట్‌బాల్ దిగ్గజ క్రీడాకారుడు, హాలీవుడ్ నటుడు ఓజే సింప్సన్ కన్ను మూశాడు. 76 ఏళ్ల సింప్సన్ కొన్నాళ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. 1969 నుంచి 1979 వరకు అమెరికాలోని విఖ్యాత నేషనల్ ఫుట్‌బాల్ లీగ్ (ఎన్ఎఫ్ఎల్)లో బఫెలో బిల్స్, శాన్ఫ్రాన్సిస్కో 49ఈఆర్ఎస్ జట్లకు సింప్సన్ ప్రాతినిధ్యం వహించాడు. 1994 జూన్‌లో తన మాజీ భార్య నికోల్ బ్రౌన్, ఆమె స్నేహితుడు రొనాల్డ్ గోల్డ్మన్ల జంట హత్య కేసులో ప్రమేయం ఉందంటూ సింప్సన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అంతర్జాతీయంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో 11 నెలల విచారణ తర్వాత సింప్సన్ నిర్దోíÙగా బయటపడ్డాడు. అయితే 2007లో సింప్సన్ లాస్ వేగస్‌లోని ఓ క్యాసినోలో మారణాయుధాలతో ప్రవేశించి దోపిడికి పాల్పడ్డారు. విచారణ అనంతరం 2008లో సింప్సన్‌కు 33 ఏళ్ల జైలు శిక్ష విధించారు. తొమ్మిదేళ్ల జైలు శిక్ష అనుభవించాక 2017లో సింప్సన్ పెరోల్‌పై విడుదలయ్యాడు. -
అలా డోర్ తెరిచినందుకు హత్య చేశాడు!
అమెరికా ఫుట్‌బాల్ మాజీ ఆటగాడు ఒ.జె.సింప్సన్ తన భార్యను ఉద్దేశపూర్వకంగా హత్య చేయలేదని అతడి ఏజెంట్ మైక్ గిల్బర్ట్ తెలిపాడు. రెండు దశాబ్దాల కిందట జరిగిన హత్య వివరాలను మీడియాకు వివరించాడు. 1994 జూన్ 12 సింప్సన్ తన భార్య నికోలస్ బ్రౌన్ ను హత్య చేసిన విషయంలో సింప్సన్ నిందితుడు. అయితే ఆ రోజు తన భార్యను చూసేందుకు సింపసన్ వెళ్లగా బాయ్ ఫ్రెండ్ వచ్చాడనుకుని నికోలస్ భావించింది. అయితే బాయ్ ఫ్రెండ్ మార్కస్ అల్లెన్ వచ్చి డోర్ కొట్టాడని నికోలస్ భావించి వెంటనే కత్తి తీసుకుంది. తీవ్ర ఆవేశంలో వచ్చి నికోల్ డోర్ ఓపెన్ చేసింది. కంగారులో ఉన్న నికోలస్ వచ్చింది భర్త అని తెలుసుకునే లోపే దారుణం జరిగిందని పేర్కొన్నాడు. కత్తితో దాడికి దిగిందని గ్రహించిన భర్త సింప్సన్ కు ఏం చేయాలో పాలుపోలేదు. షాక్ నుంచి తేరుకున్న సింప్సన్ తన భార్య నికోల్ ను హత్యచేశాడని అతడి ఏజెంట్ గిల్బర్ట్ వెల్లడించాడు. అయితే ఆ రోజు తన భార్య కత్తి పట్టుకుని డోర్ ఓపెన్ చేయకపోయి ఉంటే హత్య చేసి ఉండేవాడిని కాదని మాజీ ప్లేయర్ సింప్సన్ కూడా చాలాసార్లు ఈ విషయాన్ని ప్రస్తావించాడు. తన డైరీలోనూ సింప్సన్ ఈ ఘటనపై రాసుకున్నట్లు ఏజెంట్ వివరించాడు.