లాస్ వేగస్: వివాదాస్పద అమెరికన్ ఫుట్‌బాల్ దిగ్గజ క్రీడాకారుడు, హాలీవుడ్ నటుడు ఓజే సింప్సన్ కన్ను మూశాడు. 76 ఏళ్ల సింప్సన్ కొన్నాళ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. 1969 నుంచి 1979 వరకు అమెరికాలోని విఖ్యాత నేషనల్ ఫుట్‌బాల్ లీగ్ (ఎన్‌ఎఫ్‌ఎల్)లో బఫెలో బిల్స్, శాన్‌ఫ్రాన్సిస్కో 49ఈఆర్‌ఎస్ జట్లకు సింప్సన్ ప్రాతినిధ్యం వహించాడు.
1994 జూన్‌లో తన మాజీ భార్య నికోల్ బ్రౌన్, ఆమె స్నేహితుడు రొనాల్డ్ గోల్డ్‌మన్‌ల జంట హత్య కేసులో ప్రమేయం ఉందంటూ సింప్సన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అంతర్జాతీయంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో 11 నెలల విచారణ తర్వాత సింప్సన్ నిర్దోíÙగా బయటపడ్డాడు.
అయితే 2007లో సింప్సన్ లాస్ వేగస్‌లోని ఓ క్యాసినోలో మారణాయుధాలతో ప్రవేశించి దోపిడికి పాల్పడ్డారు. విచారణ అనంతరం 2008లో సింప్సన్‌కు 33 ఏళ్ల జైలు శిక్ష విధించారు. తొమ్మిదేళ్ల జైలు శిక్ష అనుభవించాక 2017లో సింప్సన్ పెరోల్‌పై విడుదలయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment