ఆయన నా బాయ్‌ఫ్రెండ్ అయితే బాగుంటుంది!
హిందీ విలన్ శక్తికపూర్ అంటే 1980ల్లో తెలియనివాళ్ళు లేరు. కానీ, ఈ తరానికి శక్తికపూర్‌ని పరిచయం చేయాలంటే, ‘శ్రద్ధాకపూర్ వాళ్ళ నాన్న’ అని చెప్పాలి. కొత్త తరం సెన్సేషనల్ హీరోయిన్స్ జాబితాలో శ్రద్ధాకపూర్ పేరూ ఉంటుంది. ‘ఆషికీ-2’, ‘హైదర్’ చిత్రాల ఫేమ్ అయిన శ్రద్ధ ప్రస్తుతం మణిరత్నం ‘ఓకే బంగారం’ హిందీ రీమేక్ ‘ఓకే జానూ’లో నటిస్తున్నారు. ఆమె పంచుకున్న మనోభావాల్లో కొన్ని ముచ్చట్లు...
► జీవితంలో నాకు నచ్చనిది ఏదీ లేదు. కానీ, ఒక్కోసారి జీవితం గురించి ఎక్కువ ఆలోచి స్తుంటా. అదే నన్ను బాధిస్తుంది. ఉదయమే నిద్రలేస్తా. ఆలస్యంగా పడుకోవాలంటే ఇరిటేషన్. అయామ్ నాట్ ఎట్ ఆల్ ఎ నైట్ పర్సన్.
► ఫ్యామిలీతో, ఫ్రెండ్స్‌తో టైమ్ స్పెండ్ చేస్తే మనసు ప్రశాంతం. యాక్టింగ్ పక్కన పెడితే.. సింగింగ్, డ్యాన్సింగ్, ట్రావెలింగ్ ఇష్టం. చిన్న పిల్లలంటే మరీ ఇష్టం. పెళ్ల య్యాక ఎంతమంది పిల్లలు కావా లంటే, ఓ నంబర్‌తో సరిపెట్టలేను.
► సెలబ్రిటీల్లో మీ ఫ్యాంటసీ బాయ్ ఫ్రెండ్ ఎవరైతే బాగుంటుందంటే, ‘పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్’ ఫేమ్, హాలీవుడ్ నటుడు జానీ డెప్ పేరు చెబుతా. చిన్నప్పటి నుంచి నేనూ, వరుణ్ ధావన్ గుడ్ ఫ్రెండ్స్. ఒకరి గురించి మరొకరికి తెలుసు. బాలీవుడ్లో నా బెస్ట్ ఫ్రెండ్ వరుణే.
► మహారాష్ట్ర తరహా హోమ్‌ఫుడ్ చాలా ఇష్టం. ఇంటి భోజనం ముందు స్టార్ హోటల్స్ గట్రా బలా దూర్. హోమ్ఫుడ్ని మించిన టేస్టీ ఫుడ్ ఏదీ ఉండదని నా ఫీలింగ్. బిర్యానీ కూడా ఇష్టమే. పానీ పూరీ, వడా పావ్ హ్యాపీగా లాగించేస్తా.
► ‘బాఘీ’లో యాక్షన్, ఫైట్స్ చేశా. ‘ఎబిసిడి 2’లో డ్యాన్స్ బాగా చేశా. ‘ఆషికీ2’లో రొమాంటిక్‌గా కనిపించా. మీరు నటించిన సినిమాల్లో ఏది ఇష్టమంటే చెప్పడం కష్టం. లవ్, యాక్షన్, కామెడీ, రొమాన్స్.. ఇలా డిఫరెంట్ క్యారెక్టర్లలో నటించాలనుంది. హారర్ సినిమాలు చూడడ మంటే భయం. వాటిలో నటించగలనో? లేదో? తెలియదు. ఎవరైనా మంచి అవకాశం ఇస్తే హాలీవుడ్‌లోనూ నటించాలనుంది.
► ఐదారేళ్ల వయసు నుంచి పదహారేళ్ల వయసు వరకూ పియానో వాయించా. మళ్లీ ఇప్పుడు ‘రాక్ ఆన్-2’ కోసం నా విద్య ప్రదర్శించా.
► నా పాటలన్నీ నాకిష్టమే. కానీ, ‘ఏక్ విలన్’లో పాడిన ‘గలియా..’ పాట ప్రత్యేకం. ఎందుకంటే, నేను పాడిన తొలి పాట అది.
► పబ్లిక్‌లోకి వచ్చినప్పుడు, హలో చెప్పగానే ప్రేక్షకులు చప్పట్లు కొడుతూ.. నా పేరు అరుస్తూ.. చీర్స్ చెబుతుంటే చాలా బాగుంటుంది. వాళ్లంటే ఎంత ప్రేమో మాటల్లో చెప్పలేను. ఇండస్ట్రీలోకి వచ్చాక సంపాదించిన ఆస్తి జనం అభిమానమే.
► ‘అందాజ్ అప్నా అప్నా’ మళ్లీ మళ్లీ చూడాలని పించే సినిమా. ఎన్నిసార్లు చూశానో లెక్కలేదు. సల్మాన్, ఆమిర్‌ఖాన్‌లు చేసిన ఈ మల్టీస్టారర్‌లో మా నాన్నగారు శక్తి కపూర్ విలన్‌గా నటించారు. ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే, ఒళ్లంతా కళ్లు చేసుకుని చూస్తుంటా.