ప్రైవేటు ఆస్పత్రుల్లో పాతనోట్లు తీసుకోవాలి
డీఎంహెచ్వో పద్మజారాణి
గుంటూరు మెడికల్ : జిల్లాలోని అన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స కోసం వచ్చే రోగులకు ఓపీ, ఐపీ వైద్యసేవల కోసం పెద్ద నోట్లు తీసుకోవాల్సిందేనని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ తిరుమలశెట్టి పద్మజారాణి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం రోగులకు వైద్యం చేసేందుకు వారి వద్ద ఉన్న పాత రూ.500 నోట్లు తీసుకోవాలని లేని పక్షంలో వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. డైరక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ అరుణకుమారి ఆదేశాల మేరకు జిల్లాలోని ఆస్పత్రుల యాజమాన్యాలు తప్పనిసరిగా ఈ ఆదేశాలు పాటించాలన్నారు.