old city kidnap
-
పాతబస్తీలో దారుణం.. కిడ్నాప్ చేసి ఓయో రూమ్‌లో గ్యాంగ్ రేప్!
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో దారుణం జరిగింది. కొందరు దుండగులు.. అమ్మాయి(13)ని కిడ్నాప్ చేసిన, సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. కాగా, జూబీహిల్స్ మైనర్ అత్యాచార ఘటన ఇంకా మరువకముందే ఇలా మరో ఘటన చోటుచేసుకోవడం సంచలనంగా మారింది. వివరాల ప్రకారం.. దబీర్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలో సెప్టెంబర్ 12వ తేదీ రాత్రి 8 గంటల సమయంలో ఓ మైనర్ మెడికల్ షాపునకు వెళ్లిందేకు ఇంటి నుంచి బయటకు వచ్చింది. ఈ సమయంలో ఇద్దరు యువకులు.. ఆమెను కిడ్నాప్ చేసి అదే ప్రాంతంలో ఉన్న ఓయో హోటల్ రూమ్‌కు తరలించారు. అక్కడే రెండు రోజులు ఉంచి ఒకరి తర్వాత ఒకరు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం.. బాధితురాలని చాదర్‌ఘాట్ వదిలివెళ్లారు. నడవలేని స్థితిలో ఉన్న ఆమెను గుర్తించిన స్థానికులు ఇంటికి తీసుకువెళ్లారు. కాగా, అత్యాచారం సందర్భంగా బాధితురాలికి మత్తు మందు కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. బాధితురాలు కుటుంబ సభ్యుల మేరకు కేసు నమోదు చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన నిందితులను రవేష్ మెహదీ, మహ్మదుల్లాగా గుర్తించి అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు చెప్పారు. కిడ్నాప్‌కు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీ, ఓయో రూమ్‌కు తరలిస్తున్న ఫుటేజీని పరిశీలిస్తున్నట్టు స్పష్టం చేశారు. కాగా, బాధితురాలు మైనర్ కావడంతో భరోసా సెంటర్‌కు తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. అక్కడే బాధితురాలు, ఆమె పేరెంట్స్ స్టేట్మెంట్ను రికార్డు చేయనున్నట్టు పోలీసులు వెల్లడించారు. -
క్రైం సీరియల్ చూసి.. దారుణం!
టీవీలలో వచ్చే క్రైం సీరియళ్లు యువత మీద దారుణమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి. హైదరాబాద్ పాతబస్తీలోని చాంద్రాయణగుట్ట ప్రాంతానికి చెందిన ఓ యువకుడు.. తమ పక్కింట్లో ఉండే బాలుడిని నమాజ్‌కు వెళ్తుండగా కిడ్నాప్ చేసి అతడిని హతమార్చాడు. దాదాపు రెండు వారాల క్రితం జరిగిన ఈ ఘటనలో ఆధారాలు తాజాగా బయటపడ్డాయి. చాంద్రాయణగుట్టకు చెందిన ఉరూజుద్దీన్ అనే బాలుడు ఏప్రిల్ 22వ తేదీ ఉదయం ఇంట్లోంచి వెళ్లి, రాత్రయినా తిరిగి రాలేదు. దాంతో అతడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానికంగా విచారించినప్పుడు చివరిసారిగా తాము పక్కింట్లో ఉండే మునీర్‌తో అతడిని చూశామని చెప్పారు. దాంతో అతడిని అదుపులోకి తీసుకోగా.. అతడి కుటుంబ సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. తమ రెండు కుటుంబాలు చాలా సన్నిహితంగా ఉంటాయని, అలాంటప్పుడు తమవాడి మీద ఎందుకు అనుమానించి తమను వేధిస్తారని తిరగబడ్డారు. దాంతో పోలీసులు కాస్త నెమ్మదించారు. కానీ ఈలోపు మునీర్ ముంబై పారిపోయేందుకు ప్రయత్నించగా, అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో మళ్లీ విచారించారు. దాంతో అసలు విషయం తెలిసింది. ఆరోజు నమాజ్‌కు వెళ్తున్న ఉరూజుద్దీన్‌ను తానే కిడ్నాప్ చేశానని, అయితే కిడ్నాప్ చేసిన తర్వాత ఏం చేయాలో తెలియక గొంతు నులిమి చంపేశానని అంగీకరించాడు. అతడు పారిపోయేందుకు ప్రయత్నించినా వెంటపడి మరీ తీసుకెళ్లాడు. మృతదేహాన్ని ఓ మురికి కాల్వలో పడేసినట్లు చెప్పాడు. సీసీటీవీ ఫుటేజిలో కూడా ఉరూజుద్దీన్‌ను మునీరే తీసుకెళ్లినట్లు స్పష్టంగా రికార్డయింది. దాంతో పోలీసులు మునీర్‌ను అదుపులోకి తీసుకున్నారు. తాను క్రైం సీరియళ్లు ఎక్కువగా చూస్తానని, అందుకే ఈ ఆలోచన వచ్చిందని పోలీసులకు మునీర్ చెప్పాడు. -
క్రైం సీరియల్ చూసి.. దారుణం!