Old Curency
-
Hyderabad: మొఘల్‌పురాలో.. అరుదైన కాయిన్స్, కరెన్సీ ఎగ్జిబిషన్!
నిజాం కరెన్సీతో పాటు బ్రిటిష్ కరెన్సీకి ఇప్పటికీ డిమాండ్ ఉంది. అరుదైన కాయిన్స్, కరెన్సీ ఎగ్జిబిషన్ పాతబస్తీ మొఘల్‌పురాలోని ఉర్దూ ఘర్‌లో గురువారం ఉదయం ప్రారంభమైంది. ఈ నెల 17 వరకూ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకూ కొనసాగనుంది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఏపీజే అబుల్ కలాం వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతోంది. ఈ ఎగ్జిబిషన్లో ప్రపంచ వ్యాప్తంగా 50 దేశాలకు సంబంధించిన పురాతన నాణేలు, నోట్లు అందుబాటులో ఉంచారు. మన వద్ద ఉన్న పురాతన కరెన్సీని ఇక్కడ విక్రయించ వచ్చు.. అలాగే తమకు నచి్చనవి కొనుక్కోవచ్చు. వాటికున్న చారిత్రక ప్రాధాన్యత, ప్రాముఖ్యతను బట్టి ధరలు ఉన్నాయి.ఇప్పటి తరం విద్యార్థులకు ఒకప్పటి సిల్వర్(అల్యూమినియం)తో తయారైన ఒక్క పైసా, రెండు పైసలు, మూడు పైసలు, ఐదు పైసలు ఎలా ఉంటాయో తెలీదు. ఒకటి నుంచి ఐదు వరకూ.. మధ్యలో నాలుగో పైసా ఉండదనే విషయం కూడా తెలిసి ఉండదు. తూటు పైసతో పాటు వెండి, బంగారు నాణేలు సైతం చూడని వారున్నారు. వీరందరి సౌకర్యార్థం పాతబస్తీ మొగల్‌పురాలోని ఉర్దూ ఘర్‌లో పురాతన నాణేలు, కరెన్సీతో పాటు పురాతన వస్తువులతో కూడిన ప్రత్యేక ఎగ్జిబిషన్ అందుబాటులో ఉంది. అల్ ఇండియా చార్మినార్ ఎగ్జిబిషన్ ఆఫ్ కాయిన్స్ అండ్ కరెన్సీ ఇన్ హైదరాబాద్ పేరుతో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్‌ను బీఎస్ఎన్ఎల్ మాజీ సీటీఎస్ ముంతాజ్ హుస్సేన్ ప్రారంభించారు. – చార్మినార్తూటు పైసా నుంచి ఏక్ అణా వరకూ..ఇప్పటి తరం వారు చూడని నోట్లు, కాయిన్స్ ఎన్నో ఈ ఎగ్జిబిషన్లో ఉన్నాయి. నిజాం కాలం నాటి ఏక్ అణా, దో అణా.. నయా పైసా, తూటు పైసా, సిల్వర్, గోల్డ్ కాయిన్స్ అందుబాటులో ఉన్నాయి. కేవలం కరెన్సీ మాత్రమే కాకుండా అప్పటి పోస్టల్ స్టాంప్స్, బ్యాంకుల్లో వినియోగించిన టెల్లర్ టోకెన్, సిల్వర్, మెటల్, బ్రాంజ్‌తో తయారైన కుళాయిలు, దీపాంతలు..ఇలా అన్ని రకాల పురాతన వస్తువులకూ ఉర్డూ ఘర్ వేదికైంది.సేకరణకు చక్కటి వేదిక..నగరంతో పాటు గుంటూరు, ముంబయి, ఢిల్లీ, అకోలా, బెంగళూర్, నాగ్‌పూర్, ఓడిస్సా, బీహార్, చెన్నై, కలకత్తా తదితర ప్రాంతాలకు చెందిన ఏజెన్సీలు పురాతన కరెన్సీ, కాయిన్స్ ఎగ్జిబిషన్లో ప్రదర్శిస్తున్నారు. పురాతన వస్తువులు సేకరించే హాబీ ఉన్నవారికి ఇది చక్కటి వేదిక.నాటి కరెన్సీతోనే.. నాటి కరెన్సీతో నిజాం నవాబులు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులూ లేకుండా దాన, ధర్మాలతో పాటు భారీ భవనాలను నిర్మించారని పలువురి విశ్వాసం. అందుకే నాటి వెయ్యి రూపాయలకు రూ.5 లక్షల వరకూ డిమాండ్ ఉందని నిర్వాహకులు చెబుతున్నారు. ఇటీవల జర్మనీకి చెందిన ఓ వ్యక్తి రూ.5 లక్షలు పెట్టి ఖరీదు చేశాడని.. తిరిగి తమకు విక్రయిస్తే.. రూ.5లక్షల 50వేలు ఇస్తామంటున్నా.. ఇవ్వడానికి ఇష్టపడడం లేదని చెబుతున్నారు. ఇది అప్పట్లో లండన్‌లో ముద్రించారని, అందుకే డిమాండ్ అని చెబుతున్నారు.ఏడాదికోసారి..ఇలాంటి అరుదైన పురాతన వస్తువుల ఎగ్జిబిషన్ చర్రితను తెలుపుతుంది. దీని ద్వారా పిల్లలు జ్ఞానాన్ని పొందుతారు. పురాతన వస్తువుల సేవకరణ చాలా ఇష్టం. నా దగ్గర ఉన్న పాత కాయిన్స్ విక్రయించడానికి వచ్చాను. ఏడాదికోసారైనా ఇలాంటి ఎగ్జిబిషన్ ఉండాలి. – మహ్మద్ తాహెర్, హసన్నగర్చరిత్రను తెలిపేందుకు.. నాటి చరిత్రను తెలిపేందుకు ఇలాంటి ఎగ్జిబిషన్ దోహదం చేస్తాయి. అందుకే దేశంలోని అనేక నగరాలకు చెందిన ఏజెన్సీలతో ఇటువంటి అరుదైన చారిత్రక సంపదను ఎగ్జిబిషన్లో ఉంచుతున్నాం.. ప్రజలకు చరిత్రను తెలపడంతోపాటు, పలువురు ఔత్సాహికులను ప్రోత్సహించేందుకు తోడ్పడుతున్నాం. ఇది దేశ సంపద. – సిరాజుద్దీన్, ఏపీజే అబుల్ కలాం వెల్ఫేర్ అసోసియేషన్ డైరెక్టర్ -
నోట్ల మార్పిడికి పాల్పడుతున్న ముఠా అరెస్టు
► రద్దయిన వెయ్యి, ఐదు వందల నోట్లు స్వాధీనం ► మూడు ద్విచక్ర వాహనాలు, ఎనిమిది సెల్ ఫోన్ స్వాధీనం వరంగల్: భారత ప్రభుత్వం రద్దు చేసిన నోట్లను కమీషన్ల పద్ధతిలో మార్పిడికి పాల్పడుతున్న ఎనిమిది మంది ముఠాను వరంగల్ సీసీఎస్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నిందితులను నుంచి రూ.19,52,500 రద్దయిన వెయ్యి, ఐదు వందల నోట్లతోపాటు మూడు ద్విచక్ర వాహనాలు, ఎనిమిది సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వరంగల్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో క్రైం ఏసీపీ పూజ వివరాలు వెల్లడించారు. వరంగల్ లేబర్ కాలనీకి చెందిన పోలెబాక అంబు అలియాస్ కీర్తి, సుబేదారికి చెందిన కందుకూరి సుమన్, పెద్దమ్మగడ్డకు చెందిన కంజర్ల అశోక్‌కుమార్, ఆర్ఎన్టీరోడ్కు చెందిన ప్రవీణ్, గుంటూరు జిల్లా నర్సారావుపేటకు చెందిన నోముల మల్లికార్జున్, నయీమ్‌నగర్‌కు చెందిన కొండ వెంకటేశ్వర్లు, మడికొండకు చెందిన పసుకుల మౌళి అలియాస్ నాని, ఎస్‌ఆర్‌ఆర్‌తోటకు చెందిన అరకుల మహేందర్ కలిసి రద్దయిన నోట్లను కమీషన్ పద్ధతిలో మార్పిడికి పాల్పడుతున్నారని చెప్పారు. పోలెపాక అంబు అలియాస్ కీర్తి వరంగల్ లేబర్ కాలనీలో అభయ ఫౌండేషన్ నెలకొల్పింది. ఈ ఫౌండేషన్ చాటున విలాసవంతమైన జీవితాన్ని గడిపేందుకు ప్రణాళికలను వేస్తుండేది. ఈక్రమంలో 2014 సంవత్సరంలో అభయ స్వయం సేవక సంఘం పేరుతో మహిళలతో గ్రూపులు ఏర్పాటు చేసి వాళ్ల వద్ద నుంచి డబ్బులు వసూళ్లు చేసి తిరిగి వారికే రుణాల రూపంలో డబ్బు ఇచ్చేది. ఈ సమయంలో వెయ్యి, ఐదు వందల నోట్లు రద్దు అయ్యాయి. కొద్ది మొత్తంలో రద్దయిన నోట్లను అంబు మార్పిడి చేసింది. ఆ దశలో అంబుకు సుమన్, అశోక్‌కుమార్‌తో పరిచయం ఏర్పడింది. రద్దయిన నోట్లను పెద్ద మొత్తంలో కమీషన్ రూపంలో మార్పిడికి చేయడం ద్వారా వచ్చే డబ్బును అందరం పంచుకోవచ్చని అంబు నిందితులైన సుమన్, అశోక్‌కుమార్‌లకు తెలిపింది. ఈ ఇద్దరి సూచన మేరకు మిగితా నిందితులైన మల్లికార్జున్ రూ.9,88,000, ప్రవీణ్ రూ.8,87,500, వెంకటేశ్వర్లు రూ.77 వేలు రద్దయిన వెయ్యి, ఐదు వందల నోట్ల సమకూర్చుకున్నారు. ఈ నోట్లను ఎలాగైనా మార్చాలనే ఉద్దేశంతో అంబు ఇంటికి వచ్చారు. పక్కా సమాచారం రావడంతో సీసీఎస్ ఇన్స్పెక్టర్ డేవిడ్‌రాజు సిబ్బందితో కలిసి అంబు ఇంటికి వెళ్లి సోదా చేశారు. రద్దయిన నోట్లు లభించడంతో ఆమెను అదుపులోకి తీసుకొని అరెస్టు చేసినట్లు ఏసీపీ పూజ వెల్లడించారు. కాగా, రద్దయిన నోట్లను మార్పిడి చేస్తున్న నిందితులను గుర్తించి అరెస్టు చేసిన క్రైం ఏసీపీ పూజ, సీసీఎస్ ఇన్స్పెక్టర్ డేవిడ్‌రాజ్, సబ్ ఇన్స్పెక్టర్ సుభ్రమణేశ్వరరావు, ఏఎస్ఐ సంజీవరెడ్డి, హెడ్ కానిస్టేబుల్ శోభారాణి, స్వప్న, శ్రీనివాస్‌రాజు, కానిస్టేబుల్ మహమ్మద్అలీ(మున్నా), రవికుమార్, జంపయ్యలను వరంగల్ పోలీస్ కమిషనర్ జి.సుదీర్‌బాబు అభినందించారు. -
భారీగా పాత నోట్ల పట్టివేత
బెంగళూరు: పాత రూ.500, 1000 నోట్లను మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్న ఇద్దరిని బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.1.28 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. నగర పోలీస్ కమిషనర్ ప్రవీణ్‌సూద్ తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని కోణణకుంటెకు చెందిన జిమ్మి రాహుల్, హొన్నావర నివాసి అజయ్‌లు శేషాద్రిపురం పైప్‌లైన్ రోడ్డులోని ఒక అపార్టుమెంటును అద్దెకు తీసుకున్నారు. ఇందులో పాత నోట్లను నిల్వచేసి కొత్త నోట్లు మార్చుకోవడానికి సన్నాహాలు చేస్తున్నట్లు పక్కా సమాచారం అందింది. దీని ఆధారంగా గురువారం ఉదయం వారిని అరెస్టు చేసినట్లు కమిషనర్ సూద్ తెలిపారు. నగదు మార్పిడి చేయడానికి అపార్టుమెంట్లో దాచి ఉంచారని ఆయన తెలిపారు. చెలామణి చేయడానికి సాధ్యం కాకపోవడంతో అక్కడే ఉంచారని అన్నారు. నిందితులు రియల్ఎస్టేట్ దందా నుంచి ఎలాంటి ఆధారాలు లేకుండా నగదును సేకరించారని పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో బెంగళూరులో ఇంత పెద్దమొత్తంలో పాత నోట్లు దొరకడం ఇదే మొదటిసారి.