మీ డిజైన్.. మీ నగలు
ఎప్పుడు చూసినా అవే పాత నగలు.. పాత డిజైన్లు.. కొత్త మోడల్స్ రావా అని విసుగెత్తుతున్న నారీలోకానికి నయా ట్రెండ్ గ్రాండ్‌గా వెల్కం చెబుతోంది. మార్కెట్లో ఉన్న యాక్సరీస్పై మీకు ఆసక్తి తగ్గిందా..? డోన్ట్ వర్రీ.. మీ మనసుకు నచ్చే.. మీ త నువుకు నప్పే.. నగ లు మీరే డిసైడ్ చేసుకునే చాన్స్ వచ్చేసింది. మీకు ఎలాంటి మోడల్ కావాలో ఓ కాగితం మీద గీసిస్తే చాలు.. అచ్చం అలాంటి నగే మీ సొంతం అవుతుంది. ట్రెడిషన్ మార్కుకు కొత్త నిర్వచనం చెబుతున్న కాంటెంపరరీ జువెలరీ సిటీలో హల్చల్ చేస్తోంది.
ఒకప్పుడు హాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్లకు మాత్రమే ఉపయోగించే ఈ రకం జువెలరీ ఇప్పుడు సిటీ వనితలకు చేరువయ్యాయి. కేవలం సెలబ్రిటీలకు, కాస్ట్యూమ్ డిజైనర్లకు మాత్రమే పరిమితమైన.. కాంటెంపరరీ యాక్సరీస్ ఇప్పుడు కామన్ పీపుల్ ఆలోచనలతో కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. ఏ డ్రెస్సింగ్కైనా సెట్ అయ్యేవిధంగా మీ కలల నగలు మీ కళ్ల ముందుకొచ్చేస్తున్నాయి. మీ సృజన నుంచి పుట్టిన ఈ జువెలరీ మీ మనసుకు నచ్చడమే కాదు యూనిక్ కలెక్షన్గా నిలుస్తున్నాయి.
ఇషారియా.. మాయ
కాంటెంపరరీ డిజైనింగ్స్‌తో ఇషారియా జువెలర్స్ యువతుల మనసును దోచుకుంటోంది. కస్టమర్లు కోరుకున్న విధంగా డిజైనింగ్స్ ప్రిపేర్ చేస్తున్నారు ఇషారియా డిజైనర్లు గౌరి, రాధిక టాండన్‌లు. ఎలాంటి యాక్సరీస్ కావాలో ఓ పేపర్ మీద గీసిస్తే చాలు.. దానికి తగ్గట్టుగా ప్రిపేర్ చేసిన డిజైన్స్ మీ ముందుంచుతారు. క్రిస్టల్స్, మిర్రర్స్, బ్రాస్, 18 క్యారెట్ గోల్డ్ ఇలా డిఫరెంట్ మెటీరియల్స్ ఉపయోగించి వీటిని తయారు చేస్తున్నారు. మిర్రర్ వర్క్ టెక్నిక్స్, లేపిజ్, ఒనిక్స్, ముత్యం, జాస్పర్, ఎనామిల్, కోరల్ మరెన్నో రకాల రత్నాలు పొదిగి ఈ నగలకు మరిన్ని వన్నెలద్దుతున్నారు. కాంటెంపరరీ జువెలరీగా పేరొందిన ఈ ట్రెండ్ ఇండో వెస్ట్రన్‌లో టాప్ మోడల్‌గా నిలుస్తున్నాయి.
క్లౌడియా కలెక్షన్..
కాంటెంపరరీ నెక్లెస్‌ల ప్రిపరేషన్లో జర్మన్ బేస్డ్ డిజైనర్ క్లౌడియా సత్తాచాటుకుంటున్నారు. సెలబ్రిటీలు, ఫేజ్ త్రీ పీపుల్ కోసం ప్రత్యేకంగా జువెలరీ డిజైన్ చేయడం ఈమె ప్రత్యేకత. బంజారాహిల్స్‌లోని గుడ్ ఎర్త్ వారికి మాత్రమే ఈ డిజైన్స్ అందుబాటులో ఉంటున్నాయి. ఈ కంప్లీట్ హ్యాండ్ మేడ్ నెక్ జువెలరీ తయారీలో 22 క్యారెట్ గోల్డ్, థ్రెడ్, సిల్వర్, సెమీ ప్రీసియస్ స్టోన్స్, పికాక్, పింక్, సిల్వర్ పెరల్స్ పొదిగి.. మెడలో ఒదిగిపోయేలా తయారు చేస్తున్నారు.
- శిరీష చల్లపల్లి