Old fashion
-
పాత కక్షలతో....ప్రాణం తీసిన స్నేహితులు
పరిగి: పాతకక్షలను మనసులో పెట్టుకుని స్నేహితుడినే హతమార్చారు. ఆ తర్వాత ఏమీ తెలియనట్టు నాటకం ఆడారు. పోలీసులు దర్యాప్తులో నిజం తేలడంతో కటకటాలు లెక్కపెడుతున్నారు. ఈనెల 18వ తేదీ రాత్రి పరిగి మండలంలోని బీచిగానిపల్లిలో జరిగిన యుగేంద్ర(19) హత్య కేసును పోలీసులు ఛేదించి ఇద్దరు ముద్దాయిలను పోలీసులు అరెస్టు చేసి, రిమాండుకు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన విషయాలను శుక్రవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో హిందూపురం అప్‌గ్రేడ్ స్టేషన్ సీఐ బీటీ నాయుడు మీడియాకు వెల్లడించారు. బీచిగానిపల్లికి చెందిన బూచర్ల యుగేంద్ర, రాచూరి అంజినేయులు అలియాస్ అంజి, నడింపల్లి మంజునాథ్ స్నేహితులు. హిందూపురంలోని కట్టకింద ఉన్న శివ అనే వ్యక్తి దగ్గర పెయింటింగ్ పనులు చేసేవారు. గ్రామానికే చెందిన ఓ యువతి విషయంలో అంజికి, యుగేంద్రకు విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలో ఆరునెలల క్రితం యుగేంద్ర కొత్త బైకు కొనుగోలు చేశాడు. రాత్రి ఇంటిముందు నిలపగా...నిప్పుపెట్టారు.ఈ ఘటనలో అంజి నిందితుడిగా పోలీసులు భావించారు. అయినప్పటికీ అందరూ స్నేహితులు, సమీప బంధువులు కావడంతో యథావిధిగా కలిసే పనికి వెళ్తుండేవారు. మద్యం తాగుదామని పిలిపించి... ఓ రోజు యజమాని శివ పని విషయంలో అంజి, మంజులను మందలిస్తూ చేయిచేసుకున్నాడు. ఇందుకు యుగేంద్రే కారణమని వారు భావించారు. అప్పటి నుంచి వారిద్దరూ యుగేంద్రపై కక్ష పెంచుకున్నారు. ఈ క్రమంలోనే ఈనెల 18న ఉదయం అంజి, మంజు సోమందేపల్లి మండలంలోని కేతగానిచెరువుకు వెళ్లి కల్లు తాగారు. అనంతరం ఎలాగైనా యుగేంద్రను హతమార్చాలని పథకం పన్నారు. అనంతరం సాయంత్రం ఇద్దరూ బీచిగానిపల్లికి వచ్చారు. అదే రోజు రాత్రి యుగేంద్రకు ఫోన్ చేసిన అంజి, మంజునాథ్ మద్యం తాగుదామని గ్రామ సమీపంలోని ఓ పొలం వద్దకు పిలిపించుకున్నారు. అక్కడికి చేరుకున్న యుగేంద్రను తొలుత బండరాయితో ముఖంపై బలంగా కొట్టారు. ఆపై వెంట తెచ్చుకున్న సూరకత్తితో గొంతు కోశారు. అంతటితో ఆగకుండా అతని మర్మాంగాన్ని సైతం కత్తితో కోశారు. ఆ తర్వాత ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు గ్రామస్తుల ముందు నటించారు. యుగేంద్ర హత్య కేసును దర్యాప్తు చేసిన హిందూపురం అప్‌గ్రేడ్ స్టేషన్ సీఐ బీటీ నాయుడు, అప్పటి ఇన్చార్జ్ ఎస్ఐ శ్రీనివాసులు... అంజి, మంజునాథ్‌లపై అనుమాన పడ్డారు. ఆ తర్వాత గ్రామస్తులతో విచారణ చేపట్టారు. పాతకక్షలతోనే అంజి, మంజునాథ్ యుగేంద్రను హత్య చేశారని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకున్న నిందితులు పరారు కాగా, పోలీసులు గాలింపు చేపట్టారు. ఈక్రమంలోనే శుక్రవారం మండలంలోని గొల్లపల్లి వద్ద అంజి, మంజునాథ్‌లను అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి హత్యకు ఉపయోగించిన కత్తి, యుగేంద్ర సెల్ ఫోన్‌ను స్వాధీనం చేశారు. అనంతరం న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టి రిమాండ్‌కు తరలించారు. కేసును వేగవంతంగా ఛేదించడంలో కృషి చేసిన ఎస్ఐలు నరేంద్ర, శ్రీనివాసులుతో పాటూ పోలీసు సిబ్బందిని సీఐ అభినందించారు. (చదవండి: ముగ్గురి ప్రాణాలు కాపాడిన ఫోన్ కాల్) -
సాసరో రక్షతి రక్షితః!
హ్యూమర్ ‘‘పాపం... సాసర్లు! వాటి వాడకం రోజురోజుకూ తగ్గిపోతోంది రా’’ అన్నాడు మా రాంబాబు గాడు. నేను వాడికి టీ సర్వ్ చేస్తున్నప్పుడు వాడు అన్న మాట ఇది. ‘‘సాసర్ల మీద నువ్వంత జాలిపడాల్సిన అవసరం లేదురా! వేరే ఇంకెవరికైనా మరీ ఫార్మల్గా ఇవ్వాల్సి వస్తే సాసర్ కూడా ఇచ్చే వాణ్ణేమో. నువ్వు నా క్లోజ్ ఫ్రెండ్‌వి కాబట్టి కప్పు మాత్రమే ఇచ్చా. దీంట్లో అంత బాధపడాల్సిందేముంది రా’’ అన్నాను. ‘‘అదేం కాదులే. మొత్తం మానవాళి అంతా సాసర్ పట్ల వివక్షపూరితంగా వ్యవహరిస్తోంది. ఏరు దాటాక తెప్ప తగలేసినట్లు ఎన్నాళ్లుగానో చాయ్ కప్పుకు తోడుగా వాడుకొని ఇప్పుడు దానికి ఆ తోడు కూడా లేకుండా చేస్తున్నారు ఈ మానవులు’’ ‘‘మానవులు అంటున్నావ్. సాసర్ను మనుషులు గాక జంతువులేమైనా యూజ్ చేస్తాయట్రా’’ అన్నాను. ‘‘అవును... జంతువులు యూజ్ చేస్తుంటాయి. ఎండ్రకాయ చూడు ఎంచక్కా వీపు మీద సాసర్ను బోర్లించుకున్నట్లూ... ఆ బోర్లించిన దాని కింది నుంచి నాలుగు జతల కాళ్లు బయటకు వచ్చినట్లు, అవి సాసర్ను అటూ ఇటూ లాగుతున్నట్లు ఉంటుంది. ఇక మన తాబేలును చూస్తే మాత్రం అది బోర్లించిన సాసర్ కిందికి తన ముఖాన్ని, కాళ్లూ, చేతుల్ని లోపలకు లాక్కునట్లుగా ఉంటుంది. సాసర్ గౌరవార్థం దాన్ని తమపై బోర్లించినట్లుగా బతికే జీవాలు ఎన్నెన్నో! ఈ లోకంలోని అనేక జీవులు సాసర్ను ఇంతగా నెత్తిన పెట్టుకుంటున్నాయి కదా... మరి భూమ్మీది మనుషులకేం పోయేకాలం వచ్చిందో సాసర్‌కు దక్కాల్సిన గౌరవం ఎందుకీయడం లేదో’’ అన్నాడు వాడు. ‘‘భూమ్మీద మనషులివ్వకపోతే ఆకాశం నుంచి ఎవడో ఊడిపడి వాటికి గౌరవం ఇస్తున్నాడా?’’ అన్నాను నేను. ‘‘అవును ఆకాశం నుంచి ఊడిపడేవారే ఇస్తున్నారు’’ అన్నాడు వాడు. ‘‘ఏదో మాట వరసకు ఆకాశం నుంచి ఊడిపడేవారు ఇస్తున్నారా అంటే నిజమే అంటున్నావు. అదెలారా?’’ అడిగా. ‘‘మనం దిక్కుమొక్కు లేక విమానాలూ, ఎయిర్ బస్సులూ లాంటి వాటిని ఉపయోగిస్తున్నాం గానీ... ఏలియన్స్ అనే గ్రహాంతర వాసులూ చక్కగా చక్కర్లు కొట్టడానికి విశాలంగా ఉండే సాసర్లను యూజ్ చేస్తుంటారు. విమానాలు చూడు... ఇరుకు ఇరుకుగా ఉంటాయి. అదే సాసర్ అనుకో. ఎంత విశాలంగా ఉంటుందో చూడు. ఈసారి ఎవరైనా ఏలియన్ గనక నాకు కనిపిస్తే... మన సైంటిస్టులకు ఫ్లైయింగ్ సాసర్ టెక్నాలజీ ఇవ్వమని అడుగుతా. దాంతో ఇకపై మనం కూడా పక్షి షేప్‌లో ఉండే ఓల్డ్ ఫ్యాషన్ విమానాలను వదిలేసి... హ్యాపీగా ఇకపై విశాలమైన సాసర్ ఏరోప్లేన్స్ వాడొచ్చు’’ అంటూ కాస్త గ్యాప్ ఇచ్చి ‘‘నీలాంటి వాడికి ఇలా సాసర్ ఘనతల గురించి హితబోధలు చేస్తూ డైనోసార్లకు పట్టిన గతి సాసర్లకూ పట్టకుండా చూసుకోవాలి’’ అన్నాడు వాడు. ‘‘ప్రాస కుదురుతుంది కదా అని డైనోసార్లనూ, సాసర్లనూ కలిపేస్తున్నావ్. అసలు వాటి మధ్య పోలికేమిట్రా?’’ అడిగాను నేను. ‘‘పాపం... మన డైనోసార్లు అంతరించిపోయినట్లుగానే సాసర్లూ క్రమంగా కనుమరుగైపోతున్నట్లుగా ఉందిరా’’ ‘‘అదేమిట్రా?’’ ‘‘ఇప్పుడు నువ్వు టీ ఇస్తూ కప్పు మాత్రమే ఇచ్చావు. గతంలో అందరూ టీ సర్వ్ చేసే సమయంలో దానితో పాటు సాసర్ను తప్పక ఇచ్చేవారు కదా. అప్పట్లో లోకంలో డైనోసార్లలాగే ఇప్పుడు ట్రేలలో సాసర్లు ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తున్నాయని వాటిని క్రమంగా అంతరించిపోయేలా చేస్తున్నార్రా నీలా టీ ఇచ్చే వాళ్లంతా. ‘‘అవి అంతరించి పోకుండా ఏం చేయాలని నీ ఆలోచన’’ ‘‘టీవీ ఉన్న ప్రతివాడూ సాసర్నే డిష్ ఏంటెన్నాలా తయారు చేసుకునేందుకు అవకాశం ఏదైనా ఉందేమోనని పరిశోధిస్తా. ఆ ఆవిష్కారానికి నేనేమీ పేటెంటు తీసుకోకుండా ఆ టెక్నాలజీని యథేచ్ఛగా అందరూ వాడుకునేందుకు ‘సాసరో రక్షతి రక్షితః’ అని జాతిప్రజలందరికీ ఒక పిలుపునిస్తా. డిష్ ఏంటెన్నాగా ఎవరు సాసర్ను రూపొందించు కుంటాడో... వాడికి సాసర్ అనేక ఛానెళ్లను వీక్షించే అవకాశం ఇస్తుంది. ఒక జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసి, ఆ జేఏసీ సాయంతో సాసర్‌కు దక్కాల్సిన తగిన గౌరవం కోసం ఉద్యమించాల్సిన అవసరం ఉందిరా’’ అన్నాడు వాడు ఆవేశంగా. ‘‘వద్దులేరా... నీకంత శ్రమ అవసరం లేదు. సాసర్‌కు ప్రత్యేకంగా ఒకడు గౌరవం ఇవ్వాల్సిన పనిలేదు. దాని పేరులోనే మహత్యం ఉందిరా. దాన్ని పిలవాలంటే ‘సా’ అన్న అక్షరం తర్వాత ‘సర్’ అని ప్రతివాడూ దాన్ని గౌరవిస్తాడు. కాబట్టి ఇప్పటికి నువ్వు సెలైంట్‌గా ఉండు చాలు’’ అన్నాను నేను. ‘‘నాకు తెలియని విషయం చెప్పావు. నువ్వు కూడా మెల్లగా నా దార్లోకి వస్తున్నావ్’’ అంటూ ప్రశంసించాడు మా రాంబాబు గాడు. - యాసీన్ -
పాదరక్షలు పాత ఫ్యాషనే!
ఫ్లాష్‌బ్యాక్ తోలుతో తయారు చేసిన షూస్ చాలా ఆధునికమైనవని అనుకుంటాం గానీ, ఇవి చాలా పాత ఫ్యాషనే! క్రీస్తుపూర్వం ఏడువేల సంవత్సరాల నాడే మనుషులు తోలు పాదరక్షలను వాడటం నేర్చుకున్నారు. అప్పట్లో తయారు చేసుకున్న షూస్‌కు తోలు పీలికలనే లేసుల మాదిరిగా వాడేవారు. కలపతో తయారు చేసిన పాదరక్షలను కూడా వాడేవారు. మధ్యయుగాల నాటికి పాదరక్షల తయారీలో నైపుణ్యం, కళాత్మకత పెరిగింది. క్రీస్తుశకం పదిహేనో శతాబ్ది నాటికి యూరోప్‌లో హైహీల్స్ షూస్ వాడుకలోకి వచ్చాయి. వీటి మడమలు ఏడెనిమిది అంగుళాల ఎత్తు వరకు ఉండేవి. స్త్రీ పురుష భేదం లేకుండా అప్పటి సంపన్న వర్గాల్లో అందరికీ ఆ రకం పాదరక్షలే ఫ్యాషన్‌గా ఉండేవి. పద్దెనిమిదో శతాబ్ది నాటికి ప్రపంచంలోని చాలా దేశాల్లో పాదరక్షల తయారీ కుటీర పరిశ్రమగా ఉండేది. పారిశ్రామిక విప్లవం తర్వాత, యంత్రాలతో పాదరక్షల తయారీ మొదలైన తర్వాత విప్లవాత్మక మార్పులే వచ్చాయి. వివిధ అవసరాలకు అనుగుణంగా ప్రత్యేకమైన పాదరక్షలను తయారు చేయడం మొదలైంది. ముఖ్యంగా సైనికుల కోసం ప్రత్యేకమైన షూస్ తయారు చేసేవారు. చాలాకాలం పాటు తోలు పాదరక్షలే ఎక్కువగా అందుబాటులో ఉండేవి. అయితే, ఇరవయ్యో శతాబ్దిలో రబ్బర్, ప్లాస్టిక్, సింథటిక్ వస్త్రం, కేన్వాస్ వంటి వాటితో కూడా పాదరక్షలను తయారు చేయడం ప్రారంభమైంది. పెద్దపెద్ద కార్పొరేట్ సంస్థలు పాదరక్షల తయారీరంగంలోకి అడుగుపెట్టడంతో ప్రపంచవ్యాప్తంగా బ్రాండెడ్ షూస్‌కు గిరాకీ పెరిగింది. క్రీ.పూ. 7 వేల సంవత్సరం నాటి తోలు షూ