పుష్కర భక్తులకు ‘ఓల్డ్ గన్నీస్‘ అన్నదానం
గుణదల :
వివిధ ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికుల సౌకర్యార్థం తాను అన్నసమారాధన నిర్వహిస్తున్నామని ది విజయవాడ ఓల్డ్ గన్నీస్ మర్చంట్స్ వెల్ఫేర్ అసోసియేఉషన్ ఆద్యులు గూడెల త్రినా«ద్ అన్నారు. సోమవారం సంస్థ ఆధ్వర్యంలో కెనాల్రోడ్డులో వినాయకుని గుడి సమీపంలోని బ్రహ్మచారి బావాజీమఠంలో పుష్కరయాత్రికులకు అన్నసమారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరుసగా 5 పుష్కరాల్లోనూ తాము భక్తులకు అన్నసమారాధన కార్యక్రమం చేస్తున్నామని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిత్యం రెండు వేల మందికి అన్నదానం చేస్తున్నామన్నారు. సోమవారం నుంచి పుష్కరాలు ముగింపు రోజు వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అన్నసమారాధన చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు బెవర నాయుడు, కార్యదర్శి బొల్లి సాంబశివరావు, కోశాధికారి శంభాన సూర్యనారాయణ, ఉపాధ్యక్షులు మజ్జి పెద్ద సత్యనారాయణ, సహాయ కార్యదర్శి మజ్జి ఈశ్వరరావు, సభ్యులు పులపా గోవిందు, గూడెల గంగాధరరావు, బేవర గంగాధర రావు, వూటకూరి సుబ్బారావు, షేక్మస్తాన్, అడ్డూరి రాము తదితరులు పాల్గొన్నారు.