ఖైదీ నంబర్?
సాక్షి, సంగారెడ్డి: ఎలాంటి నేరానికి పాల్పడకపోయినా.. జైలుకెళ్లాలని సరదాగా ఉందా? అసలు జైలు ఎలా ఉంటుంది? ఖైదీలకు ఎలాంటి సౌకర్యాలు ఉంటాయి? ఊచలు లెక్కపెట్టాలనుకుంటున్నారా? అయితే మీలాంటి వాళ్లకోసమే బంపర్ ఆఫర్ ప్రకటించారు సంగారెడ్డి జైలు అధికారులు.
రూ. 500 చెల్లించి మెదక్ జిల్లా సంగారెడ్డిలోని పాత జైలు మ్యూజియంలో కారాగారవాసం అనుభవించొచ్చని అధికారులు చెబుతున్నారు. మ్యూజియంకు ప్రచారం కల్పించడంలో భాగంగా అధికారులు ఈ వినూత్న కార్యక్రమానికి తెరతీశారు. ఆ విధంగా సరదాగా కాసేపు ఖైదీగా మారిపోవచ్చన్నమాట. అయితే ఖైదీలకు నంబర్లు కేటాయించకపోవడం ఈ ఆఫర్ లోని ఒకేఒక్క వెలితి. ఒకవేళ నంబర్ గానీ కేటాయిస్తే.. నేనే ఖైదీ నంబర్ 150 అనో, ఖైదీ నంబర్ 786 అనో గొప్పగా చెప్పుకోవచ్చు.! ఏంటారు?