చలికి తట్టుకోలేక వృద్ధుడి మృతి
దహేగా: ఆదిలాబాద్ జిల్లా దహేగా మండలం దర్గాపల్లిలో చలి తీవ్రతను తట్టుకోలేక వామర శంకర్(80) అనే వృద్ధుడు మృతి చెందాడు. శంకర్ ఆదివారం రాత్రి పొలం వద్దకు కావలికి వెళ్లి సోమవారం ఉదయం ఇంటికి వచ్చిన వెంటనే మృతి చెందాడు. ఆయనకు భార్య సమ్మక్క, ముగ్గురు కుమారులు ఉన్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.