గోడ కూలి వృద్ధురాలి మృతి
ఘనపురం(మహబూబ్నగర్): మహబూబ్నగర్ జిల్లా ఘనపురం మండలం కమాలొద్దీన్పూర్లో ఇంటి గోడ కూలి ఓ వృద్ధురాలు మృతిచెందింది. గ్రామానికి చెందిన ఓ మహిళ ఇంట్లో పనులు చేసుకుంటున్న సమయంలో భారీ వర్షాలకు బాగా నానిన గోడ కూలింది. దీంతో మట్టిపెళ్లలు మీదపడి ఆమె అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు.