Om Namovenkatesaya
-
‘తిరుమలకు వెళ్లిన అనుభూతి కలిగింది’
తమిళసినిమా: తిరుమల వెళ్లి వేంకటేశ్వరుని దర్శించుకున్నంత అనుభూతి కలిగిందని సీనియర్ నటుడు శివకుమార్ పేర్కొన్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే ఆయన బ్రహ్మాండనాయగన్ చిత్రాన్ని చూసి అలా ప్రశంసించారు. బ్మహ్మాండ నాయగన్ చిత్రం అంటే మరేదో కాదు. తెలుగులో నాగార్జున, అనుష్క ప్రధాన పాత్రలు పోషించిన ఓం నమోవేంకటేశాయ చిత్రమే. శతాధిక చిత్రాల దర్శకుడు రాఘవేంద్రరావు మరో భక్తిరస బ్రహ్మాండ సృష్టే ఈ చిత్రం. శ్రీవేంకటేశ్వరస్వామి పరమ భక్తుడైన హథీరాంబాబాగా నాగార్జున నటించిన ఈ చిత్రంలో ఆ దేవదేవుని భక్తురాలు ఆండాళ్గా అనుష్క నటించారు. కీరవాణి సంగీతాన్ని అందించిన ఇందులో 12 గీతాలు చోటు చేసుకున్నాయి. ఈ చిత్రం ఇప్పుడు తమిళ ప్రేక్షకుల ముందుకు బ్రహ్మాండనాయగన్ పేరుతో రానుంది. జ్యోషిక ఫిలింస్ సంస్థ తమిళంలోకి అనువదించిన ఈ చిత్రాన్ని స్టార్ బాక్స్ సంస్థ విడుదల హక్కులను పొంది త్వరలో విడుదలకు సన్నాహాల చేస్తోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు చిత్రాన్ని సీనియర్ నటుడు శివకుమార్‌కు ప్రత్యేకంగా ప్రదర్శించారు. చిత్రం చూసిన ఆయన చిత్రం నిజంగానే బ్రహ్మాండంగా ఉందని, శ్రీవేకటేశ్వరునికి ఆయన భక్తుడికి మధ్య జరిగిన యథార్థ సంఘటనలను చూసి తరించవచ్చునని పేర్కొన్నారు. ఈ చిత్రం చూసిన తరువాత మనసు భక్తి పరవశంతో పొంగిపోయిందన్నారు. తిరుపతి, తిరుమలలోని వెంకన్నను దర్శించుకున్న అనుభూతి కలిగిందని అన్నారు. -
పోలీస్ పాత్రలో కింగ్..?
ప్రస్తుతం సీనియర్ హీరోలలో ఫుల్ ఫాంలో ఉన్న స్టార్ కింగ్ నాగార్జున. యంగ్ జనరేషన్ జోరు పెంచటంతో కమర్షియల్ సినిమాలను పక్కన పెట్టి ప్రయోగాత్మక చిత్రాలతో అలరిస్తున్న నాగ్ త్వరలో ఓ పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్కు రెడీ అవుతున్నాడట. ఇటీవల ఊపిరి సినిమాతో అలరించిన మన్మథుడు, ప్రస్తుతం చారిత్రక కథాంశంతో తెరకెక్కుతున్న ఓం నమోవేంకటేశాయ సినిమాలో పరమ భక్తుడు హాథీరాం బాబాగా నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత కాస్త చేంజ్ కోసం ఓ కమర్షియల్ ఎంటర్టైనర్ చేస్తే బాగుంటుందన్న ఆలోచనలో ఉన్నాడు నాగ్. అందుకే చందూ మొండేటి దర్శకత్వంలో ఓ పోలీస్ కథతో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు. కార్తీకేయ, ప్రేమమ్ సినిమాల సక్సెస్‌లతో మంచి ఫాంలో ఉన్న చందూ, తన నెక్ట్స్ సినిమాను నాగ్ లాంటి సీనియర్ హీరోతో చేస్తే తన రేంజ్ కూడా పెరుగుతుందని భావిస్తున్నాడట. మరి ప్రయోగాల మూడ్‌లో ఉన్న నాగ్, చందూ కథకు ఓకె చెప్తాడో లేదో చూడాలి.