ఉగ్రదాడి: ఎయిర్‌బేస్ సిబ్బందిలో ఒకరి మృతి
పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై ఉగ్రవాదులు చేసిన దాడిలో ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సిబ్బందిలో ఒకరు మరణించగా, మరో ఐదుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వాళ్లను ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. జవాన్లు, ఉగ్రవాదులకు మధ్య తెల్లవారుజామున 3.30 ప్రాంతంలో మొదలైన కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. తొలుత శుక్రవారం నాడు ఒక ఎస్పీపై దాడిచేసి ఆయన వాహనాన్ని లాక్కున్న ఉగ్రవాదులు.. ఆ వాహనంలోనే ఎయిర్‌బేస్ సమీపంలోకి చేరుకున్నారు. ఏడుగురు ఉగ్రవాదులు ప్రవేశించినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. ఎయిర్‌బేస్‌లోని మిగ్ 29, హెలికాప్టర్లపై దాడికి ఉగ్రవాదులు ప్రయత్నించినా, కేవలం ఎయిర్‌బేస్‌లోని సివిల్ ప్రాంతానికి మాత్రమే వారిని భద్రతా దళాలు పరిమితం చేయగలిగాయి. ఫైటర్ జెట్లకు గానీ, చాపర్లకు గానీ ఎలాంటి నష్టం లేదని ఆర్మీ ప్రకటించింది.
ఇప్పటికే అక్కడ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్, ఆర్మీ దళాలు మోహరించాయి. ఉగ్రవాదులు భారత సైనిక యూనిఫాంలో వచ్చినా, వారిని వెంటనే పసిగట్టి ఎన్ఎస్జీ జవాన్లు కాల్పులు జరిపారు. దాంతో వాళ్లలో ఇద్దరు హతమయ్యారు.