one boy
-
ఒడి పట్టిన హీరో
లాక్డౌన్ వల్ల నడిచినవారు ఎందరో. వారిలో గమ్యం చేరిన వారు ఎందరో. మధ్యలో రాలిపోయినవారు ఎందరో. కరోనా కలకలంలో కొన్నే తెలిశాయి. కొన్ని తెలియకనే ముగిశాయి. తెలిసినవి మాత్రం అందరినీ కలవర పరిచాయి. స్పందించేవారు స్పందిస్తున్నా సాయం చేసేవారు చేస్తున్నా అనంతమైన సహాయం అందాల్సిన పరిస్థితిలో పేదలు ఉన్నారు. ఊహించని చోట నుంచి ఓదార్పు లభించినప్పుడు వారు కాస్తయినా ఊరట చెందుతున్నారు. బిహార్‌లోని ముజప్ఫర్పూర్ రైల్వేస్టేషన్లో జరిగిన ఘటన అందరికీ తెలుసు. మే 25న మధ్యాహ్నం బిహార్‌లోని ముజప్ఫర్‌పూర్‌లో ఒక శ్రామిక్ రైల్ ఆగింది. అందులో నుంచి ఒక శవాన్ని దించేశారు. అది ఒక స్త్రీ శవం. ఆమె పేరు అర్బినా ఖాతూన్. ఆమెకు రెండేళ్ల పసివాడు ఉన్నాడు. స్టేషన్లో శవానికి ఒక దుప్పటి కప్పి నేలన పరుండబెట్టాడు. ఆమె కొడుకు తల్లి నిద్రపోతూ ఉందని ఆడుకోవడం మొదలుపెట్టాడు. మధ్య మధ్య వచ్చి దుప్పటి తొలగించి తల్లిని నిద్ర లేపేందుకు ప్రయత్నించాడు. కన్నతల్లి చనిపోయిందని తెలియని ఆ పసి కందు ప్రయత్నాన్ని వీడియో ద్వారా చూసి దేశమంతా మనసు బరువు చేసుకుంది. ఆ పసివాడి కోసం ఇప్పుడు నటుడు షారూక్ ఖాన్ స్పందించాడు. వాడి భవిష్యత్తు తానే చూసుకుంటానని అన్నాడు. లాక్డౌన్ తర్వాత ఎక్కడి వారక్కడే చిక్కుకుపోయిన వలస కార్మికులలో అర్బినా ఖాతూన్ ఒకామె. ఆమెను భర్త ఒదిలేశాడు. బిహార్ నుంచి గుజరాత్ వలస వెళ్లి పిల్లవాడితో బతుకుతూ ఉంది. మే 25న ఆమె అహ్మదాబాద్ నుంచి తన స్వస్థలం కతిహార్‌కు శ్రామిక్‌రైలులో బయలుదేరి మార్గమధ్యలో చనిపోయింది. ముజప్ఫర్‌పూర్‌లో ఆమె శవాన్ని దించేయాల్సి వచ్చింది. ఆకలి వల్ల చనిపోయిందో అనారోగ్యం వల్ల చనిపోయిందోగాని కడుపున పుట్టిన బిడ్డను అనాథను చేసింది. ఆ పిల్లాడు ఇప్పుడు కతిహార్‌లోని తాత, అమ్మమ్మల దగ్గర ఉన్నాడు. ఈ ఘటన షారుక్ ఖాన్ వరకూ చేరింది. పిల్లవాడిని తన ఆధ్వర్యంలో నడిచే మీర్ ఫౌండేషన్ దత్తత తీసుకొని వాడి బాగోగులు చూస్తుందని వెల్లడి చేశాడు. ‘తల్లిదండ్రుల్లో ఒకరిని కోల్పోతే ఎలా ఉంటుందో నాకు తెలుసు’ అని అతడు వ్యాఖ్యానించాడు. ‘ఆ వీడియోను నలుగురికీ తెలిసేలా చేసిన మిత్రులకు ధన్యవాదాలు’ అని తెలియచేశాడు. ఒక చిన్నారికి గట్టి ఆసరా దొరికింది. ఇంకా దొరకాల్సిన వారు వేనవేలు. -
బంతుల కోసం వెళ్లి బలయ్యాడు
బంజారాహిల్స్: క్రికెట్ ఆడాలని బంతులు తెచ్చుకునేందుకు టెన్నిస్ బాల్‌కోర్టులోకి దూకిన ఓ బాలు డు వాటిని తీసుకుని గోడదూకి వచ్చే క్రమంలో ట్రాన్స్ఫార్మర్ను తాకి విద్యుదాఘాతానికి గురై మృత్యువాతపడిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్ డివిజన్ ఫిలింనగర్‌లోని దుర్గా భవానీనగర్‌లో నివాసం ఉండే యాదమ్మ, శేఖర్ల కుమారుడు మంజరి అఖిల్ (12) 6వ తరగతి చదువుతున్నాడు. ఆదివారం బడి లేకపోవడంతో తోటి స్నేహితులతో కలిసి ఉదయం క్రికెట్ ఆడుతుండగా బంతి పోగొట్టుకున్నాడు. దీంతో పక్కనే ఉన్న ఎఫ్ఎన్సీసీ టెన్నిస్ కోర్టులో వృథాగా పడి ఉన్న టెన్నిస్ బంతులను తెచ్చుకుందామని గోడదూకి వెళ్లాడు. మాగంటి కాలనీని ఆనుకొని ఉన్న ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ టెన్నిస్ కోర్టులో నిత్యం టెన్నిస్ ఆడుతుం టారు. ఆట పూర్తయిన తర్వాత ఆ బంతులను బుట్టలో వేస్తుంటారు. అది తెలిసిన అఖిల్ ఎమ్మార్సీ కాలనీ వైపునున్న ఎత్తైన గోడను ఎక్కి ట్రాన్స్ఫార్మర్ పక్క నుంచి లోపలికి వెళ్లి బంతులను తెచ్చే క్రమంలో గోడ దూకడానికి యత్నించాడు. పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ను తాకడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడే కుప్పకూలిపోయాడు. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఒకే కాన్పులో ముగ్గురు
ఆకివీడు : ఉండి గ్రామానికి చెందిన ఆళ్ల రామలక్ష్మి ఒకే కాన్పులో ముగ్గురు బిడ్డలకు జన్మనిచ్చింది. రామలక్షి్మకి 8 నెలలు నిండగ నొప్పులు రావడంతో బుధవారం రాత్రి స్థానిక లక్ష్మీ ఆసుపత్రిలో చేర్చారు. ఈ క్రమంలో వైద్యురాలు కవిత గురువారం తెల్లవారుజామున రామలక్షి్మకి ఆపరేషన్ చేశారు. ఒకే కాన్పులో ఒక మగబిడ్డ, ఇద్దరు ఆడపిల్లలు జన్మించినట్టు చెప్పారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని చెప్పారు. ఇది ఇలా ఉండగా రామలక్షి్మకి ఇది రెండో కాన్పు.. తొలి కాన్పులో ఆమె ఆడ పిల్లకు జన్మనిచ్చింది. రామలక్ష్మి భర్త శ్రీనివాస్ తాపీ మేస్రి్తగా పనిచేస్తున్నాడు.