one man injured
-
ఉసురు తీసిన విద్యుత్ షాక్
వర్గల్ (గజ్వేల్): విద్యుత్ షాక్ ఓ రైతు కుటుంబంలో పెనువిషాదం నింపింది. తండ్రి దుర్మరణం చెందగా, కొడుకు తీవ్ర గాయాలతో బ్రెయిన్ డెడ్ అయ్యాడు. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం రాంసాగర్‌పల్లిలో శుక్రవారం ఈ విషాదకర ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. వర్గల్ మండలం నెంటూరు గ్రామపంచాయతీ పరిధిలోని రాంసాగర్పల్లికి చెందిన రైతు కిచ్చుగారి సత్తయ్య(65)కు భార్య లక్ష్మి, వీరికి రెండెకరాల లోపు సాగు భూమి ఉన్నది. శుక్రవారం సత్తయ్య తన పెద్ద కొడుకు నర్సింహులు(35)తో కలసి వ్యవ సాయ బోరు వద్ద సర్వీసు వైరు మార్పిడి చేసేందుకు వెళ్లాడు. స్తంభం నుంచి బోరు బావికి సర్వీసు వైరు మార్పిడి చేసుకుంటున్న విషయాన్ని నర్సింహులు అక్కడి లైన్‌మన్ బాలరాజుకు ఫోన్ లో వివరించి కరెంటు సరఫరా నిలిపేయాలని కోరాడు. లైన్మెన్ సరేననడంతో కరెంటు నిలిపేశారనే ధైర్యంతో బోరుబావి వద్ద విద్యుత్ స్తంభం ఎక్కిన నర్సింహులు, సర్వీసు వైరు బిగించే పనిలో నిమగ్నమయ్యాడు. వైరు రెండో కొనను తండ్రి సత్తయ్య పట్టుకుని చూస్తున్నాడు. అంతలోనే విద్యుత్ సరఫరా జరగడంతో తండ్రీ కొడుకులు విద్యుత్‌షాక్‌కు గురయ్యారు. గాయపడిన తండ్రి సత్తయ్య ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. స్తంభంపై నుంచి కిందపడి గాయాలపాలైన కొడుకు నర్సింహులను చికిత్స కోసం గజ్వేల్ కు ఆ తరువాత హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. నర్సింహులు బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు చెప్పినట్లు గ్రామ స్తులు వివరించారు. లైన్ క్లియర్ (ఎల్సీ) ఇ చ్చిన లైన్‌మన్ బాల్‌రాజు నిర్లక్ష్యమే సత్తయ్య ఉసురు తీసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ గ్రామస్తులు మజీద్‌పల్లి సబ్‌స్టేషన్ వద్ద రహదారిపై బైఠాయించారు. దీంతో డిపార్ట్మెంట్ తరఫున రూ. 5 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని మధ్యవర్తులు నచ్చచెప్పడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. -
కంటెయినర్–బైక్ ఢీ
పటాన్చెరు టౌన్: కంటైనర్ వెనుకాల నుంచి ద్వీచక్రవాహనాన్ని ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందగా, మరోకరికి తీవ్ర గాయాలైన సంఘటన పటాన్చెరు పోలీసు స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం..హైదరబాద్ కోకపేట్ రాజేంద్రనగర్ కాలనీకి చెందిన మెహ్మద్ కైఫ్, అతని స్నేహితుడు అయోద్య ప్రజాపతి ద్విచక్రవాహనంపై మంగళవారం ఉదయం పటాన్చెరు మండల పరిధిలోని పాశంమైలారంలో వారు పని చేసే కంపెనీకి వెళ్తున్నారు. ముత్తంగి విష్ణు లాడ్జ్ ఎదురుగా జాతీయ రహదారిపై వెనుకాల నుంచి వచ్చిన కంటైనర్ వీరు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో వాహనం నడుపుతున్న మెహ్మద్ కైఫ్(17) తలకు తీవ్రగాయం కావడంతో అక్కడిక్కడే మృతిచెందాడు. అయోద్య ప్రజాపతికి స్వల్ప గాయాలు కావడంతో చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టూమార్టం కోసం పటాన్చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. మృతిచెందిన మెహ్మద్ కైఫ్(17) -
కాటేదాన్‌లో కాల్పులు.. వ్యాపారి పరిస్థితి విషమం!
హైదరాబాద్: నగరంలోని కాటేదాన్‌లో సోమవారం సాయంత్రం కాల్పులు చోటుచేసుకోవడం కలకలం రేపింది. కాటేదాన్‌లో ఉన్న ఆన్లైన్ కార్యకలాపాలు నిర్వహించే ఓ దుకాణంలో ప్రసాద్ అనే వ్యక్తిపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ప్రసాద్‌ను సమీపంలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రసాద్ హవాలా వ్యాపారం చేస్తాడని సమాచారం. కాల్పుల ఘటనతో అప్రమత్తమైన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. సంఘటన స్థలంలోని సీసీటీవీ కెమెరా దృశ్యాలను వారు పరిశీలిస్తున్నారు. డీసీడీ సత్యనారాయణ, ఏరియా ఏసీపీ సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు.