కాటేదాన్‌లో కాల్పులు.. వ్యాపారి పరిస్థితి విషమం! | firing at katedan, one man injured seriously | Sakshi
Sakshi News home page

కాటేదాన్‌లో కాల్పులు.. వ్యాపారి పరిస్థితి విషమం!

Published Mon, May 2 2016 6:34 PM | Last Updated on Tue, Oct 2 2018 2:30 PM

కాటేదాన్‌లో కాల్పులు.. వ్యాపారి పరిస్థితి విషమం! - Sakshi

కాటేదాన్‌లో కాల్పులు.. వ్యాపారి పరిస్థితి విషమం!

హైదరాబాద్‌: నగరంలోని కాటేదాన్‌లో సోమవారం సాయంత్రం కాల్పులు చోటుచేసుకోవడం కలకలం రేపింది. కాటేదాన్‌లో ఉన్న ఆన్‌లైన్ కార్యకలాపాలు నిర్వహించే ఓ దుకాణంలో ప్రసాద్‌ అనే వ్యక్తిపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ప్రసాద్‌ను సమీపంలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రసాద్ హవాలా వ్యాపారం చేస్తాడని సమాచారం.

కాల్పుల ఘటనతో అప్రమత్తమైన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. సంఘటన స్థలంలోని సీసీటీవీ కెమెరా దృశ్యాలను వారు పరిశీలిస్తున్నారు. డీసీడీ సత్యనారాయణ, ఏరియా ఏసీపీ సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement