
పటాన్‌చెరు టౌన్: కంటైనర్ వెనుకాల నుంచి ద్వీచక్రవాహనాన్ని ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందగా, మరోకరికి తీవ్ర గాయాలైన సంఘటన పటాన్‌చెరు పోలీసు స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం..హైదరబాద్ కోకపేట్ రాజేంద్రనగర్ కాలనీకి చెందిన మెహ్మద్ కైఫ్, అతని స్నేహితుడు అయోద్య ప్రజాపతి ద్విచక్రవాహనంపై మంగళవారం ఉదయం పటాన్‌చెరు మండల పరిధిలోని పాశంమైలారంలో వారు పని చేసే కంపెనీకి వెళ్తున్నారు. ముత్తంగి విష్ణు లాడ్జ్ ఎదురుగా జాతీయ రహదారిపై వెనుకాల నుంచి వచ్చిన కంటైనర్ వీరు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో వాహనం నడుపుతున్న మెహ్మద్ కైఫ్(17) తలకు తీవ్రగాయం కావడంతో అక్కడిక్కడే మృతిచెందాడు. అయోద్య ప్రజాపతికి స్వల్ప గాయాలు కావడంతో చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టూమార్టం కోసం పటాన్‌చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
మృతిచెందిన మెహ్మద్ కైఫ్(17)
Comments
Please login to add a commentAdd a comment