ఇల్లు కూలి చిన్నారి మృతి
లక్నో: ఉత్తరప్రదేశ్ బారాబంకి జిల్లాలోని ఫగూర గ్రామంలో గురువారం అర్థరాత్రి ఇల్లు కూలింది. ఈ ప్రమాదంలో ఏడాది వయస్సు గల బాలుడు అక్కడికక్కడే మరణించాడు. మరో ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులు ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. శిథిలాల కింద నుంచి చిన్నారి మృతదేహం వెలికి తీసినట్లు పోలీసులు చెప్పారు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు పేర్కొన్నారు.