ఒంగోలులో మరో బైకు దహనం
ఒంగోలు క్రైం:
నగరంలోని బలరాం కాలనీలో శనివారం అర్ధరాత్రి దుండగులు మరో బైకును దహనం చేశారు. స్థానికంగా మెకానిక్‌గా పనిచేసే కరీముల్లా సాయంత్రం షెడ్డు మూసి తన మోటారు సైకిల్‌పై ఇంటికి వెళ్లాడు. ఇంటి ముందు తన వాహనాన్ని పార్క్ చేశాడు. అర్ధరాత్రి ఇంటి ముందు మంటలు రావటంతో పరిసర ప్రాంతాలవారు గమనించి అదుపు చేశారు. అప్పటికే బైకు పూర్తిగా కాలిపోయింది. బాధితుడు ఒంగోలు తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గత నెలలో పట్టణంలో వివిధ చోట్ల నాలుగు బైకులు, కారును దుండగులు తగులబెట్టిన విషయం తెలిసిందే.