ఏఐసీసీలో కూడా ప్రక్షాళన: పొంగులేటి
హైదరాబాద్: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ ఆత్మపరిశీలన చేసుకుంటోందని ఆ పార్టీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. ఆయన గురువారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ.. ఏప్రిల్లో జరిగే ఏఐసీసీ సమావేశాల్లో వివిధ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై సమీక్ష ఉంటుందన్నారు. తెలంగాణతో పాటు ఏఐసీసీలో కూడా ప్రక్షాళన ఉండే అవకాశం ఉందన్నారు. తెలంగాణకు రావల్సిన విద్యుత్, నీటి వాటాల గురించి మాట్లాడకుండా చంద్రబాబు నాయుడు తెలంగాణలో పర్యటించడాన్ని ప్రజలు సహించరని పొంగులేటి వ్యాఖ్యానించారు.