వైఎస్ వర్ధంతి సందర్భంగా ఉల్లిపాయల పంపిణీ
దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆరో వర్ధంతిని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. పలు జిల్లాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించారు. పలుచోట్ల ఆస్పత్రుల్లో ఉన్న రోగులకు పళ్లు పంపిణీ చేశారు.
అయితే విజయవాడలో మాత్రం ఆయన అభిమానులు కాస్త విభిన్నంగా ఆలోచించారు. ప్రస్తుతం ప్రజలకు అత్యంత అవసరంగా ఉండి, ఏమాత్రం అందుబాటులో లేకుండా పోయిన ఉల్లిపాయలు అందిస్తే బాగుంటుందని భావించారు. దాంతో, విజయవాడ సీతారాపురం కొత్త వంతెన వద్ద ఉల్లిపాయల పంపిణి చేశారు. స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు మానం వెంగయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతమ్ రెడ్డి చేతుల మీదుగా ఉల్లిపాయల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.