online dating sites
-
డేటింగ్ యాప్‌లో పరిచయం.. 70 ప్లస్‌లో ప్రేమ.. ఆపై పెళ్లి
ప్రేమకు వయసుతో సంబంధం లేదు.. ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్, ప్రేమకు సరిహద్దులు లేవు... ఈ డైలాగులు అప్పుడప్పుడు సినిమాల్లో మనం వింటూనే ఉంటాం. అయితే ఇద్దరు వృద్ధులు మాత్రం ఏడు పదులు వయసులో కూడా ఆ మాటలను నిజం చేసి చూపించారు. అసలు ఈ 70 ప్లస్ లవ్‌స్టారీ ఎలా మొదలైందంటే.. పెయింటర్, రిటైర్డ్ ప్రొఫెసర్ అయిన జిమ్ ఆడమ్స్కు పెళ్లయిన 38 సంవత్సరాల తర్వాత 2017లో తన భార్యను కోల్పోయాడు. ఇటీవల కరోనా కారణంగా విధించిన లాక్డౌన్ సమయంలో, 78 ఏళ్ల అతను తనకి ఓ తోడు కావాలని నిర్ణయించుకుని 50 ఏళ్లు పైబడిన మహిళ కోసం ఆన్లైన్ డేటింగ్ యాప్‌లో లాగిన్ అయ్యాడు. అలా తోడు కోసం వెతుకుతున్న ఆడమ్స్కు అనుకోకుండా 79 ఏళ్ల రిటైర్డ్ ఇన్సూరెన్స్ బ్రోకర్ ఆడ్రీని కలిశాడు. ఆమె 33 సంవత్సరాల క్రితం విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటోంది. చివరికి ఒకిరికొకరు నచ్చడంతో ఇటీవలే పెళ్లి కూడా చేసుకుంది ఆ జంట. దీనిపై ఆడ్రీ.. నేను ఆ యాప్ ఉపయోగించిన తక్కువ సమయంలోనే ఆడ్రీని చూశాను. నాతో పరిచయం పెంచుకున్న తర్వాత మేము దగ్గర కావడానికి ఎక్కువ రోజులు కూడా పట్టలేదు. ఎందుకంటే తను కూడా నా లాంటి క్రేజీ పర్సన్ కాబట్టి.. అంటూ తెలిపాడు. ఈ ఏడాది సెప్టెంబర్ 25వ తేదీ వీరి ప్రేమ బంధం పెళ్లి బంధంగా మార్చుకుంది ఆ వృద్ధ జంట. ప్రస్తుతం నెట్టింట జిమ్, ఆడ్రి పెళ్లి చేసుకున్న ఫోటోలు వైరల్‌గా మారి చక్కర్లు కొడుతున్నాయి. ఆ జంటను చూసిన నెటిజన్లు వారికి ఆల్ ది బెస్ట్ అని కామెంట్ పెడుతున్నారు. పోస్ట్ అప్లోడ్ చేసినప్పటి నుండి 1.5 లక్షలకు పైగా లైకులు వచ్చాయి. చదవండి: Viral: ప్రియుడి బాధ చూడలేక ప్రేయసి త్యాగం.. సినిమాల్లో కూడా సాధ్యం కాదేమో ! -
ఆన్లైన్ డేటింగ్లో చీటింగ్
లండన్: భార్యాభర్తలు ఒకరికొకరు దూరమై ఒంటరితనంతో బాధ పడుతున్న వారెందరో ఆన్లైన్ డేటింగ్ సైట్లను ఆశ్రయిస్తున్నారు. ఈ డేటింగ్లలో ఆశించిన ఆనందం దొరక్కపోగా మరింత విషాదం వారి జీవితాలను అలుముకుంటోంది. కోరుకున్నవారు కోరుకున్నట్లు ఉండకపోవడంతో హతాశులవుతున్నవారు ఎందరో! ఏదోరకంగా భార్యాపిల్లలకు దూరమై ఒంటరిగా బతుకుతున్న కొంతమంది వయోవృద్ధుల అనుభవాలు ఇలా ఉన్నాయి.... ఆన్లైన్ డేటింగ్ సైట్లో కనిపించే మహిళల ఫొటో కనీసం పది నుంచి పాతికేళ్ల క్రితం తీసుకున్నదై ఉంటుంది. వయస్సు కారణంగానో, మేకప్ కారణంగానో చూడడానికి ఫొటో అందంగా కనిపించవచ్చు. తీరా వెళ్లి చూస్తే పీక్కుపోయి ముడతలు పడిన ముఖంతోనీ, పిచ్చుక గూడులాగానో, చింపిరి జుట్టుతోనో కనిపించడం ఖాయం. సన్నగా నాజూగ్గా కనిపిస్తుందనుకుంటే సుమోలకు తీసిపోని విధంగా ఉంటారు. ఆన్లైన్లో వారి ఫొటోలకన్నా కలిసే నాటికి కనీసం యాభై కిలోల బరువు ఎక్కువుంటారు. ఆకారం ఎలా ఉంటేనేమీ మానసికంగా కంపెనీ ఇచ్చేవాళ్లుంటే చాలులే అనుకుంటే వెనక్కి తిరిగి పిక్క బలం చూపించాల్సిన అవసరం కూడా ఏర్పడుతోంది. ఒకరినొకరు అర్థం చేసుకునే మాటల సంగతి అటుంచి ఐదు నిమిషాలకు మించి భరించలేని సుత్తి కబుర్లను సరికొత్తగా వినాల్సి వస్తోంది. మాజీ భర్త లేదా మాజీ బోయ్ ఫ్రెండ్ గురించో, ఇంట్లో పెంచుకుంటున్న కుక్కలు, పిల్లుల గురించో, చిన్నప్పుడే భగ్నమైన ప్రేమ గురించో విఫులంగా వినాల్సి వస్తోంది. తల్లీ పిల్లలను ఖరీదైన హోటళ్లకు తిప్పడమే పనిగా పెట్టుకోవడం, బేబీ సిట్టింగ్లతో సేవలు చేయడమూ తప్పదు. పిల్లల పెళ్లిళ్ల లాంటి బరువు బాధ్యతలు కూడా మోయాల్సి రావచ్చు. సైట్లో వెల్లడించే హాబీలు ఎలా ఉంటాయంటే..... - పర్యటించడమంటే ఎంతో ఇష్టమన్నారంటే పక్కనున్న హాలీ డే రిసార్ట్‌కు వెళ్లడం. - ఫారిన్ ఫుడ్ ఎంతో ఇష్టమంటే పూరీలు తినే వాళ్లు, నూడుల్స్ తినడం లాంటిది. - సంగీతాన్ని ప్రేమిస్తానని అన్నారంటే ‘సౌండ్ ఆఫ్ మ్యూజిక్’ సినిమా చూసిన గుర్తు ఉండడం. -జంతువులను ప్రేమిస్తానంటే పెంచుకుంటున్న పిల్లులను, కుక్కలను ఇష్టపడడం. -సోషల్ డ్రింక్స్ అంటే పీకలదాకా తాగి సొమ్మసిల్లి పడిపోవడం. -సెన్సిటివ్ అంటే, బాటిల్ వైన్ తాగి గత జీవితం గురించి బాధపడడం. -అప్పుడప్పుడు సెక్స్ దొరికినా నిజమైన ప్రేమ మాత్రం ఎప్పటికీ దొరకదు. ఆక్స్ఫర్డ్ షైర్లో ఓ కంపెనీకి డెరైక్టర్‌గా పని చేస్తున్న 51 ఏళ్ల స్టీఫెన్ నైట్స్, గ్లౌసెస్టర్షైర్లో ట్రాన్స్పోర్ట్ బిజినెస్ మేన్‌గా పనిచేస్తున్న 51 ఏళ్ల గేరిబాల్, లింకన్‌షైర్‌కు చెందిన 61 ఏళ్ల జాన్వేన్, బోగ్నర్ రేజిస్కు చెందిన 62 ఏళ్ల జాన్ మెర్రిట్, బెర్క్‌షైర్‌కు చెందిన రిటైర్డ్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ 67 ఏళ్ల మార్టిన్ కర్టీస్, రిటైర్డ్ రెస్టారెంట్ ఓనర్ 70 ఏళ్ల బ్రెయిన్ ఫెట్చర్లు ఆన్లైన్ డేటింగ్లో గత నాలుగేళ్లలో ఎదుర్కొన్న అనుభవాలు. వారు ఇంచుమించు తమ ఏజ్ వాళ్లతోనే డేటింగ్ చేశారు. డేటింగ్‌కు స్వస్తి చెప్పి ఇష్టమైన మద్యం సేవిస్తూ, ఇష్టమైన సినిమా ఒంటరిగా చూడడమే బెటర్ అని వారు సలహా ఇస్తున్నారు. వీళ్ల సంగతి సరే, మరి ఆన్లైన్లో డేటింగ్ చేస్తున్న మహిళల సంగతేమిటి? వారి అనుభవాలు ఇంతకంటే వెగటు పుట్టించేలా ఉంటాయోమో! వీరిలాగా వారు కూడా మీడియా ముందుకొచ్చి చెబితేగానీ వాస్తవాలు తెలియవు. -
అక్రమ సంబంధాల గుట్టువిప్పిన హ్యాకర్లు
న్యూయార్క్: వివాహేతర సంబంధాల కోసమే వెలసిన ‘ఆశ్లే మాడిసన్’ అనే ఓ ఆన్లైన్ డేటింగ్ సైట్‌పై హ్యాకర్లు దాడి చేయడంతో ఈ సైట్ ద్వారా వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నవారి గుట్టు కాస్త రట్టయింది. దీంతో కొంత మంది కొంప కొల్లేరుకాగా, వందలాది మంది సంబంధాలు ఒక్కసారిగా కుప్పకూలి పోయాయి. ఇలా సంబంధాలు కుప్పకూలిపోయిన వారిలో ఒక్కొక్కరిది ఒక్కోకథ. వారా కథలను ‘విష్పర్’ అనే యాప్ ద్వారా బయటపెట్టి లబోదిబోమంటున్నారు. ‘నా ప్రేయసిని నేను కోల్పోయాను. నా ఇల్లు కూడా పోయింది. పిల్లలకు కూడా మొహం చూపించలేక పోతున్నాను’ ఇది ఒకరి కథ. ‘నా ప్రపంచం ఒక్కసారిగా తలకిందులై పోయింది. సమాజంతో మొహం ఎత్తుకోలేక పోతున్నా’ ఇది మరొకరి బాధ. ‘నేను ఛీట్ చేశాను. కానీ నేను దొరకలేదు. మరొకరితో రాసక్రీడలు సాగిస్తున్న నా ప్రేయసి దొరికి పోయింది. అయినా ఆమెను క్షమించేశాను. అయినా ఆమె నన్ను విడిచి మరొకరితో వెళ్లి పోయింది’ ఇది ఇంకొకరి ఆవేదన. ‘నా మనసంతా కకావికలమైంది. గుట్టు చప్పుడు కాకుండా మరొకరితో సాగిస్తున్న సంబంధాలను ఇంకేమాత్రం భరించలేను’ ఇది మరొకరి రియాక్షన్. ‘నేను చేసిన ఛీటింగ్‌కు క్షమించమని వేడుకున్నా. అయినా నా ప్రేయసి నన్ను కాదని వెళ్లి పోయింది’....ఇలాంటి సీరియస్ కథలేకాకుండా. ప్రతీకార ప్రతిస్పందనలు కూడా ఉన్నాయి. ‘నేను ఆయన కోసం షాపింగ్ చేస్తుంటే అక్కడ మరో యువతితో కులుకుతాడా? అందుకు ప్రతీకారం తీర్చుకోవడం కోసం నేనూ మరో యువకుడితో రాత్రి గడిపాను’ లాంటి వ్యాఖ్యలు కూడా విష్పర్లో కోకొల్లలుగా కనిపిస్తున్నాయి. ఆన్లైన్ డేటింగ్ సైట్‌ను అర్జంట్‌గా మూసివేయకపోతే తమ దాడులను ఇలాగే కొనసాగిస్తామని, గుట్టుచప్పుడు కాకుండా నెరపుతున్న వివాహేతర సంబంధాలను రట్టుచేసి రచ్చ చేస్తామని కూడా ‘ఆశ్లే మాడిసన్’ సైట్ సీఈవోను హ్యాకర్లు హెచ్చరించారు. 2012లో ప్రారంభమైన ‘విష్పర్’ను కూడా ప్రపంచవ్యాప్తంగా యూజర్లు ఉన్నారు. ముఖ్యంగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థినీ విద్యార్థులు దీన్ని ఎక్కువగా వినియోగిస్తున్నారు. పేరు, ఊరు, ఫోన్ నెంబర్ లేకుండా గ్రీటింగ్ కార్డుల రూపంలో యూజర్లు ఈ యాప్ ద్వారా తమ సందేశాలను పంపించే వీలుంది. -
వీలైతే నాలుగు మాటలు.. కుదిరితే..
ఏదైనా ప్రోడక్ట్ అమ్మాలంటే ప్రకటనలిస్తారు.. అయితే, ఇది ప్రేయసిని వెతుక్కోవడానికి ఇచ్చిన ప్రకటన! విషయమేమిటంటే.. అమెరికాలోని షికాగోకు చెందిన గోర్డాన్ ఎంగెల్(40) ఈ మధ్య భార్య నుంచి విడాకులు తీసుకున్నాడు. ఖాళీగా ఉండటం ఇష్టం లేక.. మళ్లీ తన మనసుకు నచ్చిన నెచ్చెలి వేటలో పడ్డాడు. ఆన్లైన్ డేటింగ్ సైట్లు వంటివాటిని ప్రయత్నించి, ప్రయత్నించి విసిగిపోయాడు. దీంతో వీలైతే నాలుగు మాటలు.. కుదిరితే కప్పు కాఫీ టైపులో.. ‘నా పేరు గోర్డాన్.. పద డిన్నర్కెళ్దాం’ అంటూ షికాగోలో అత్యంత రద్దీగా ఉండే ఎక్స్‌ప్రెస్‌వే మీద ఈ వినూత్న భారీ ప్రకటన ఇచ్చాడు. ఇందుకోసం వేల డాలర్లు వెచ్చించాడు. ఈ బిల్‌బోర్డు మీదే గోర్డాన్ చిత్రం, అతడి డేటింగ్ వెబ్సైట్ www.helpgordyfindlove.com చిరునామా పెట్టాడు. దీనికి మంచి స్పందన లభిస్తోంది