ఆన్‌లైన్ డేటింగ్‌లో చీటింగ్ | Men's toe-curling stories of dates from hell reveal it's hard for them to find love online | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్ డేటింగ్‌లో చీటింగ్

Published Mon, Dec 28 2015 6:42 PM | Last Updated on Sun, Sep 3 2017 2:42 PM

ఆన్‌లైన్ డేటింగ్‌లో చీటింగ్

ఆన్‌లైన్ డేటింగ్‌లో చీటింగ్

లండన్: భార్యాభర్తలు ఒకరికొకరు దూరమై ఒంటరితనంతో బాధ పడుతున్న వారెందరో ఆన్‌లైన్ డేటింగ్ సైట్లను ఆశ్రయిస్తున్నారు. ఈ డేటింగ్‌లలో ఆశించిన ఆనందం దొరక్కపోగా మరింత విషాదం వారి జీవితాలను అలుముకుంటోంది. కోరుకున్నవారు కోరుకున్నట్లు ఉండకపోవడంతో హతాశులవుతున్నవారు ఎందరో! ఏదోరకంగా భార్యాపిల్లలకు దూరమై ఒంటరిగా బతుకుతున్న కొంతమంది వయోవృద్ధుల అనుభవాలు ఇలా ఉన్నాయి....

ఆన్‌లైన్ డేటింగ్ సైట్‌లో కనిపించే మహిళల ఫొటో కనీసం పది నుంచి పాతికేళ్ల క్రితం తీసుకున్నదై ఉంటుంది. వయస్సు కారణంగానో, మేకప్ కారణంగానో చూడడానికి ఫొటో అందంగా కనిపించవచ్చు. తీరా వెళ్లి చూస్తే పీక్కుపోయి ముడతలు పడిన ముఖంతోనీ, పిచ్చుక గూడులాగానో, చింపిరి జుట్టుతోనో కనిపించడం ఖాయం. సన్నగా నాజూగ్గా కనిపిస్తుందనుకుంటే  సుమోలకు తీసిపోని విధంగా ఉంటారు. ఆన్‌లైన్‌లో వారి ఫొటోలకన్నా కలిసే నాటికి కనీసం యాభై కిలోల బరువు ఎక్కువుంటారు. ఆకారం ఎలా ఉంటేనేమీ మానసికంగా కంపెనీ ఇచ్చేవాళ్లుంటే చాలులే అనుకుంటే వెనక్కి తిరిగి పిక్క బలం చూపించాల్సిన అవసరం కూడా ఏర్పడుతోంది.

ఒకరినొకరు అర్థం చేసుకునే మాటల సంగతి  అటుంచి ఐదు నిమిషాలకు మించి భరించలేని సుత్తి కబుర్లను సరికొత్తగా వినాల్సి వస్తోంది.  మాజీ భర్త లేదా మాజీ బోయ్ ఫ్రెండ్ గురించో, ఇంట్లో పెంచుకుంటున్న కుక్కలు, పిల్లుల గురించో, చిన్నప్పుడే భగ్నమైన ప్రేమ గురించో విఫులంగా వినాల్సి వస్తోంది. తల్లీ పిల్లలను ఖరీదైన హోటళ్లకు తిప్పడమే పనిగా పెట్టుకోవడం, బేబీ సిట్టింగ్‌లతో సేవలు చేయడమూ తప్పదు. పిల్లల పెళ్లిళ్ల లాంటి బరువు బాధ్యతలు కూడా మోయాల్సి రావచ్చు.

 సైట్లో వెల్లడించే హాబీలు ఎలా ఉంటాయంటే.....

- పర్యటించడమంటే ఎంతో ఇష్టమన్నారంటే పక్కనున్న హాలీ డే రిసార్ట్‌కు వెళ్లడం.
- ఫారిన్ ఫుడ్ ఎంతో ఇష్టమంటే పూరీలు తినే వాళ్లు, నూడుల్స్ తినడం లాంటిది.
- సంగీతాన్ని ప్రేమిస్తానని అన్నారంటే ‘సౌండ్ ఆఫ్ మ్యూజిక్’ సినిమా చూసిన గుర్తు ఉండడం.

-జంతువులను ప్రేమిస్తానంటే పెంచుకుంటున్న పిల్లులను, కుక్కలను ఇష్టపడడం.
-సోషల్ డ్రింక్స్ అంటే పీకలదాకా తాగి సొమ్మసిల్లి పడిపోవడం.
-సెన్సిటివ్ అంటే, బాటిల్ వైన్ తాగి గత జీవితం గురించి బాధపడడం.
-అప్పుడప్పుడు సెక్స్ దొరికినా నిజమైన ప్రేమ మాత్రం ఎప్పటికీ దొరకదు.

ఆక్స్‌ఫర్డ్‌ షైర్‌లో ఓ కంపెనీకి డెరైక్టర్‌గా పని చేస్తున్న 51 ఏళ్ల స్టీఫెన్ నైట్స్, గ్లౌసెస్టర్‌షైర్‌లో ట్రాన్స్‌పోర్ట్ బిజినెస్ మేన్‌గా పనిచేస్తున్న 51 ఏళ్ల గేరిబాల్, లింకన్‌షైర్‌కు చెందిన 61 ఏళ్ల జాన్‌వేన్, బోగ్నర్ రేజిస్‌కు చెందిన 62 ఏళ్ల జాన్ మెర్రిట్, బెర్క్‌షైర్‌కు చెందిన రిటైర్డ్ మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్ 67 ఏళ్ల మార్టిన్ కర్టీస్, రిటైర్డ్ రెస్టారెంట్ ఓనర్ 70 ఏళ్ల బ్రెయిన్ ఫెట్చర్‌లు ఆన్‌లైన్ డేటింగ్‌లో గత నాలుగేళ్లలో ఎదుర్కొన్న అనుభవాలు.

వారు ఇంచుమించు తమ ఏజ్ వాళ్లతోనే డేటింగ్ చేశారు. డేటింగ్‌కు స్వస్తి చెప్పి ఇష్టమైన మద్యం సేవిస్తూ, ఇష్టమైన సినిమా ఒంటరిగా చూడడమే బెటర్ అని వారు సలహా ఇస్తున్నారు. వీళ్ల సంగతి సరే, మరి ఆన్‌లైన్‌లో డేటింగ్ చేస్తున్న మహిళల సంగతేమిటి? వారి అనుభవాలు ఇంతకంటే వెగటు పుట్టించేలా ఉంటాయోమో! వీరిలాగా వారు కూడా మీడియా ముందుకొచ్చి చెబితేగానీ వాస్తవాలు తెలియవు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement