ఎన్నారైలకు బహుమతుల కోసం గరుడ బజార్
పెళ్లిళ్లు, పుట్టిన రోజులు, ఇతర శుభకార్యాలు జరిగాయంటే ఉత్త చేతులతో వెళ్లకుండా ఏదో ఒక బహుమతి తీసుకెళ్లడం మన సంప్రదాయం. ఇటీవలి కాలంలో అలా వచ్చిన అతిథులను ఖాళీ చేతులతో పంపకుండా, వారికి రిటర్న్ గిఫ్టులు ఇవ్వడం కూడా మరో సంప్రదాయంగా మారింది. ఆతిథేయుల కోసం అతిథులు బహుమతులు తీసుకొస్తే, వారిని సంతోషపరచడానికి ఆతిథేయులు రిటర్న్ గిఫ్టులు ఇస్తున్నారు. అమెరికాలో ఉన్న భారతీయులు ఇలాంటి రిటర్న్ గిఫ్టులు, ఇతర బహుమతులు కొనాలంటే షాపింగ్ చేయడానికి తగినంత సమయం దొరకదు. అలాంటివారి కోసమే కొత్తగా గరుడబజార్ అనే వెబ్సైట్ ఒకదాన్ని ప్రారంభించారు.
www.garudabazaar.com అనే ఈ సైట్లో సంప్రదాయం ఉట్టిపడేలా కుంకుమ భరిణెల దగ్గర్నుంచి అనేక రకాల వస్తువులు కావల్సిన రేంజిలో లభ్యమవుతాయని నిర్వాహకులు తెలిపారు. ఎవరికైనా బహుమతి పంపాలన్నా.. తమకు వెళ్లడానికి తీరిక లేకపోతే ఇందులో బుక్ చేసి, ఇవ్వాలనుకున్నవారి చిరునామా చెబితే చాలు. అక్కడకు ఆ గిఫ్టు వెళ్లిపోతుంది. బహుమతుల నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా పూర్తిగా తనిఖీ చేస్తామని, అందువల్ల బహుమతి గురించి, దాని నాణ్యత గురించి వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిర్వాహకులు ఓ ప్రకటనలో వివరించారు.