రిలయన్స్ లైఫ్ నుంచి ఆన్లైన్ టర్మ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రైవేటు రంగ బీమా కంపెనీ రిలయన్స్ లైఫ్ అందుబాటు ధరల్లో ఆన్లైన్ టర్మ్ పాలసీని ప్రవేశపెట్టింది. పూర్తి పారదర్శకంగా, సులభంగా తీసుకునే విధంగా ఈ ఆన్లైన్ టర్మ్ పాలసీని రూపొందించినట్లు రిలయన్స్ లైఫ్ సీఈవో అనూప్ రావు తెలిపారు. 25 ఏళ్ల ఉన్న వ్యక్తి కోటి రూపాయలకు బీమా తీసుకుంటే రోజుకు కేవలం రూ.15 ప్రీమియం చెల్లిస్తే సరిపోతుందన్నారు. కనీస బీమా మొత్తం రూ.25 లక్షలు, కనీస వార్షిక ప్రీమియం రూ.3,500లుగా నిర్ణయించారు. ధూమపానం అలవాటు లేనివారికి, మహిళలకు ప్రీమియంలో తగ్గింపును రిలయన్స్ లైఫ్ అందిస్తోంది.