'సామాజిక తెలంగాణ ఇస్తే చాలు'
హైదరాబాద్: చెస్ట్ ఆసుపత్రి మార్పు అనేది ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఏకపక్ష నిర్ణయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మంగళవారం అన్నారు. ఈ విషయంపై అఖిలపక్షాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని చాడ వెంకట్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బంగారు తెలంగాణ సంగతి ఏమో కాని... సామాజిక తెలంగాణ ఇస్తే చాలు అంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి సీఎం కేసీఆర్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.