ఒంటిమిట్ట పీఎస్లో ఎర్రచందనం దుంగలు మాయం
ఒంటిమిట్ట : ఇన్నాళ్లు అడవిని కొల్లగొట్టిన ఎర్రచందనం దొంగలు బరితెగించారు. ఏకంగా పోలీస్ స్టేషన్ లో ఉన్న దుంగలను ఎత్తుకెళ్లారు. వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్లో దుండగలు చోరికి పాల్పడ్డారు. అధికారులు సంరక్షణలో ఉన్న 15 పైగా ఎర్రచందనం దుంగలను శుక్రవారం తెల్లవారుజామున ఎత్తుకెళ్లారు. ఈ విషయం తెలిసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. దుండగలు దొంగిలించిన ఎర్రచందనం దుంగల విలువ సుమారు రూ. 15 లక్షలు ఉండవచ్చని సమాచారం. సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.